Sittamu vachchinattellaam jeyumanave

చిత్తము వచ్చినట్టెల్లాఁ జేయుమనవే
Language

(॥పల్లవి॥)
చిత్తము వచ్చినట్టెల్లాఁ జేయుమనవే
పొత్తుల కూరిమితోడ బోదించవలెనా

(॥॥)
మనసుమర్మ మెఱఁగు మరిగినవాఁడు తాను
యెనలేనివిన్నపము లేమిసేసేవే
వెనకకె బాసలెల్లా వేవేలుఁ జేసె నాకు
పెనఁగి బలిమిసేసి పిలువఁగవలెనా

(॥॥)
పిన్ననాఁడె సేసవెట్టి పెండ్లాడె నన్నుఁ దాను
వన్నెల నింకా నేమివావి చెప్పీనే
పన్ని దేవుళ్లలోనెల్లాఁ బుట్టముగట్టె తాను
యిన్నిటా నాసుద్దులెల్లా నెచ్చరించవలెనా

(॥॥)
చెలఁగుమేనరికపుశ్రీవేంకటేశుఁడు దాను
కలసీ నప్పటి నేమి గడునవ్వీనే
యెలమి నెప్పుడుఁ బాయ కింటనే వున్నాఁడు తాను
వలపులు చల్లి ఇంకా వాసిరేఁచవలెనా

(||pallavi||)
sittamu vachchinaṭṭĕllām̐ jeyumanave
pŏttula kūrimidoḍa bodiṁchavalĕnā

(||||)
manasumarma mĕṟam̐gu mariginavām̐ḍu tānu
yĕnalenivinnabamu lemiseseve
vĕnagagĕ bāsalĕllā vevelum̐ jesĕ nāgu
pĕnam̐gi balimisesi piluvam̐gavalĕnā

(||||)
pinnanām̐ḍĕ sesavĕṭṭi pĕṁḍlāḍĕ nannum̐ dānu
vannĕla niṁkā nemivāvi sĕppīne
panni devuḽlalonĕllām̐ buṭṭamugaṭṭĕ tānu
yinniḍā nāsuddulĕllā nĕchchariṁchavalĕnā

(||||)
sĕlam̐gumenarigabuśhrīveṁkaḍeśhum̐ḍu dānu
kalasī nappaḍi nemi gaḍunavvīne
yĕlami nĕppuḍum̐ bāya kiṁṭane vunnām̐ḍu tānu
valabulu salli iṁkā vāsirem̐savalĕnā