చిత్తము వచ్చినట్లు నేఁ జేసేఁగాని
(॥పల్లవి॥)
చిత్తము వచ్చినట్లు నేఁ జేసేఁగాని
బత్తి గొట్టానఁ బెట్టెవు పదరకు చాలును
(॥చిత్త॥)
నీరువంక తుంగవంటి నీ మాటలనే మమ్ము
వూరకే మోచి దించేవు నోపఁబో నేను
మోరతోపుఁదనమున ముట్టివచ్చి తేఁగనక
గోర గీరితే నేరౌను కొంగుముట్ట కిఁకను
(॥చిత్త॥)
మూడిఁజొచ్చి వాతవెళ్లేముడి కారితనముల
వోడక పంతమాడేవు వోపఁబో నేను
యేడనైనా వచ్చినీవు యెన్నికతో బాసగొని
యీడుగాని పనులకు నెమ్మెలు సేయకుమీ
(॥చిత్త॥)
మాయలనే భ్రమయించి మానము చేకొంటి విదె
వొమయ్య కాలుదొక్కేవు వోపఁబో నేను
యీయెడ శ్రీవేంకటేశ యింతసేసి కూడితిని
పాయము నీకే సెలవు పది బదిగాను
(||pallavi||)
sittamu vachchinaṭlu nem̐ jesem̐gāni
batti gŏṭṭānam̐ bĕṭṭĕvu padaragu sālunu
(||sitta||)
nīruvaṁka tuṁgavaṁṭi nī māḍalane mammu
vūrage mosi diṁchevu nobam̐bo nenu
moradobum̐danamuna muṭṭivachchi tem̐ganaga
gora gīride neraunu kŏṁgumuṭṭa kim̐kanu
(||sitta||)
mūḍim̐jŏchchi vādavĕḽlemuḍi kāridanamula
voḍaga paṁtamāḍevu vobam̐bo nenu
yeḍanainā vachchinīvu yĕnnigado bāsagŏni
yīḍugāni panulagu nĕmmĕlu seyagumī
(||sitta||)
māyalane bhramayiṁchi mānamu segŏṁṭi vidĕ
vŏmayya kāludŏkkevu vobam̐bo nenu
yīyĕḍa śhrīveṁkaḍeśha yiṁtasesi kūḍidini
pāyamu nīge sĕlavu padi badigānu