చిత్తము వచ్చినప్పుడు చేర వచ్చే వింతే కాక
(॥పల్లవి॥)
చిత్తము వచ్చినప్పుడు చేర వచ్చే వింతే కాక
యిత్తల నిందరిలోన నేమి బాఁతి నేను
(॥చిత్తము॥)
చెక్కులు నొక్కెటివారు సేసలు వెట్టెటివారు
యిక్కువ లంటెటివారు యెందురు నీకు
వెక్కస మీ సందడిలో వేసరించఁ బోతేను
యెక్కడి కెక్కు నావల పేమి బాఁతి నేను
(॥చిత్తము॥)
ముచ్చట నుండెటివారు మొగము చూచెటివారు
యిచ్చకా లాడెటివారు యెందరు నీకు
పచ్చిగా నీమూఁకలలో పచరించఁ బోతేను
యెచ్చటఁ గనేవు గురు తేమి బాఁతి నేను
(॥చిత్తము॥)
కమ్ముక కూడెటివారు కాఁకలు చల్లెటివారు
యెమ్మెలు సెరుపేవారు యెందరు నీకు
దొమ్మిలో శ్రీవెంకటేశ తొల్లె నన్నుఁ గూడితివి
యిమ్ములఁ జెయి వట్టెవు యేమి బాఁతి నేను
(||pallavi||)
sittamu vachchinappuḍu sera vachche viṁte kāga
yittala niṁdarilona nemi bām̐ti nenu
(||sittamu||)
sĕkkulu nŏkkĕḍivāru sesalu vĕṭṭĕḍivāru
yikkuva laṁṭĕḍivāru yĕṁduru nīgu
vĕkkasa mī saṁdaḍilo vesariṁcham̐ bodenu
yĕkkaḍi kĕkku nāvala pemi bām̐ti nenu
(||sittamu||)
muchchaḍa nuṁḍĕḍivāru mŏgamu sūsĕḍivāru
yichchagā lāḍĕḍivāru yĕṁdaru nīgu
pachchigā nīmūm̐kalalo pasariṁcham̐ bodenu
yĕchchaḍam̐ ganevu guru temi bām̐ti nenu
(||sittamu||)
kammuga kūḍĕḍivāru kām̐kalu sallĕḍivāru
yĕmmĕlu sĕrubevāru yĕṁdaru nīgu
dŏmmilo śhrīvĕṁkaḍeśha tŏllĕ nannum̐ gūḍidivi
yimmulam̐ jĕyi vaṭṭĕvu yemi bām̐ti nenu