Sittamu vachchinappudu segoni mannimchanee

చిత్తము వచ్చినప్పుడు చేకొని మన్నించనీ
Language

(॥పల్లవి॥)
చిత్తము వచ్చినప్పుడు చేకొని మన్నించనీ
తత్తరము తనమీఁద దరవు వెట్టితిని

(॥చిత్త॥)
తనరూపమే మతిఁ దలఁచుక వున్నదాన
అనుచు నెవ్వరితోడ నాడుకోఁ గాని
యెనలేని తన చిత్త మెటైనా నుండనీ
తనువుఁ జైతన్యము తనకే యెక్కినది

(॥చిత్త॥)
కిమ్ములఁ దా నన్ని నెరిఁగీ నని వున్నదాన
యెమ్మె లితరులవలె నెచ్చరించను
సమ్మతించి తన కవి చవియైనప్పుడు గానీ
తమ్మిరేకులకన్నులు తనమీఁద నున్నవి

(॥చిత్త॥)
గక్కనఁ దాఁ గూడఁగాను కానిమ్మని వున్నదాన
వెక్కసమై యిఁక నేమి వెగ్గళించేనా
యిక్కువ శ్రీవేంకటేశుఁ డీతఁడే నావస మాయ
తక్కినపనులెల్లాను తనచేతిలోనివి

(||pallavi||)
sittamu vachchinappuḍu segŏni manniṁchanī
tattaramu tanamīm̐da daravu vĕṭṭidini

(||sitta||)
tanarūbame madim̐ dalam̐suga vunnadāna
anusu nĕvvaridoḍa nāḍugom̐ gāni
yĕnaleni tana sitta mĕḍainā nuṁḍanī
tanuvum̐ jaidanyamu tanage yĕkkinadi

(||sitta||)
kimmulam̐ dā nanni nĕrim̐gī nani vunnadāna
yĕmmĕ lidarulavalĕ nĕchchariṁchanu
sammadiṁchi tana kavi saviyainappuḍu gānī
tammiregulagannulu tanamīm̐da nunnavi

(||sitta||)
gakkanam̐ dām̐ gūḍam̐gānu kānimmani vunnadāna
vĕkkasamai yim̐ka nemi vĕggaḽiṁchenā
yikkuva śhrīveṁkaḍeśhum̐ ḍīdam̐ḍe nāvasa māya
takkinabanulĕllānu tanasedilonivi