చిత్తము వచ్చిన ట్టెల్లఁ జేసుఁ గాకా
(॥పల్లవి॥)
చిత్తము వచ్చిన ట్టెల్లఁ జేసుఁ గాకా
బత్తితోడ నేల వొడఁబరచీనె నన్నునూ
(॥చిత్తము॥)
చేరి తనతో నవ్వి సేసపాలకు లో నైతి
బీరాన నేఁ బొందు సేసి బేల నైతిని
సారె సారెఁ దనవంక జాలదా నా కింత మేలు
పోరి పోరి యిఁక నేమి బుజ్జగించీ నన్నునూ
(॥చిత్తము॥)
కన్నులఁ జూచినందుకు కాలమందె లో నైతి
యెన్ని తనునే నమ్మి యిం తైతిని
మన్ననలు దనవంక మరి యింతకంటే నేవి
కొన్నకో లై యిఁక నేమి గొంగు వట్టీ నన్నునూ
(॥చిత్తము॥)
మాటలు దనతో నాడి మన సిట్టె తనిసితి
యీటుకుఁ బెనఁగఁ బోయి యేక మైతిని
గాఁటపు శ్రీవెంకటాద్రిఘనుఁడు దా నన్నుఁ గూడె
ఆఁటదాన నేల మచ్చీ యప్పటిని నన్నునూ
(||pallavi||)
sittamu vachchina ṭṭĕllam̐ jesum̐ gāgā
battidoḍa nela vŏḍam̐barasīnĕ nannunū
(||sittamu||)
seri tanado navvi sesabālagu lo naidi
bīrāna nem̐ bŏṁdu sesi bela naidini
sārĕ sārĕm̐ danavaṁka jāladā nā kiṁta melu
pori pori yim̐ka nemi bujjagiṁchī nannunū
(||sittamu||)
kannulam̐ jūsinaṁdugu kālamaṁdĕ lo naidi
yĕnni tanune nammi yiṁ taidini
mannanalu danavaṁka mari yiṁtagaṁṭe nevi
kŏnnago lai yim̐ka nemi gŏṁgu vaṭṭī nannunū
(||sittamu||)
māḍalu danado nāḍi mana siṭṭĕ tanisidi
yīḍugum̐ bĕnam̐gam̐ boyi yega maidini
gām̐ṭabu śhrīvĕṁkaḍādrighanum̐ḍu dā nannum̐ gūḍĕ
ām̐ṭadāna nela machchī yappaḍini nannunū