చిత్తము నొచ్చేవు సుమీ చెలియ చేఁతలకును
(॥పల్లవి॥)
చిత్తము నొచ్చేవు సుమీ చెలియ చేఁతలకును
బత్తి నీ పైఁ జేయుటకు పాదువలె నాయను
(॥॥)
పువ్వులచెండు వేసెఁ బొలిఁ తి ని న్నినుమారు
రవ్వలుగ నవి నీ వురమునఁ దాఁ కె
జవ్వని దనకు చాల సరి దాఁ కించె నని
చివ్వన నీకుఁ జూపి చెప్పి నయ ట్లాయను
(॥॥)
రతికి దగ్గరఁ గాను రాకు మని చేతఁ బట్టే
మతకాన నంతలోనీ మర్మము సోఁ కె
సతిని చేయి వట్టి సరిఁ బెండ్లియాడుటకు
జతనాన నిదియే సూచనలై నిలిచెను
(॥॥)
యెదురుమాట లాడి ఇంతి పాదానఁ జిమ్మఁ గా
చెదరి నీవు మొక్కేటి శిరసు దాఁ కె
అదన శ్రీ వేంకటేశ అలమేలుమంగ యాకె
వుదుటునఁ గూడె నిదే వుంకువలై మెరసె.
(||pallavi||)
sittamu nŏchchevu sumī sĕliya sem̐talagunu
batti nī paim̐ jeyuḍagu pāduvalĕ nāyanu
(||||)
puvvulasĕṁḍu vesĕm̐ bŏlim̐ ti ni nninumāru
ravvaluga navi nī vuramunam̐ dām̐ kĕ
javvani danagu sāla sari dām̐ kiṁchĕ nani
sivvana nīgum̐ jūbi sĕppi naya ṭlāyanu
(||||)
radigi daggaram̐ gānu rāgu mani sedam̐ baṭṭe
madagāna naṁtalonī marmamu som̐ kĕ
sadini seyi vaṭṭi sarim̐ bĕṁḍliyāḍuḍagu
jadanāna nidiye sūsanalai nilisĕnu
(||||)
yĕdurumāḍa lāḍi iṁti pādānam̐ jimmam̐ gā
sĕdari nīvu mŏkkeḍi śhirasu dām̐ kĕ
adana śhrī veṁkaḍeśha alamelumaṁga yāgĕ
vuduḍunam̐ gūḍĕ nide vuṁkuvalai mĕrasĕ.