Sittamu lerimgi sevaseyarammaa

చిత్తము లెరిఁగి సేవసేయరమ్మా
Language

(॥పల్లవి॥)
చిత్తము లెరిఁగి సేవసేయరమ్మా
పొత్తుల బువ్వానకు పొసఁగించరమ్మా

(॥॥)
పీఁటమీఁదఁ గూచుండి పెండ్లాడి రిద్దరును
చీటికిమాటికి నట్టె సిగ్గుపడేరు
మాటలాడించి చూచితే మంతనమాడుకొనేరు
తేటలుగా నింతలోనె తెరవేయరమ్మా

(॥॥)
చేతు లొగ్గించుకొంటాను సేసలు వెట్టుకొనేరు
పోతరించి సెలవులఁ బూఁచి నవ్వేరు
ఘాతల నొకరొకరిఁ గడకన్నులఁ జూచేరు
నీతెరిఁగి పచ్చడము నిండఁ గప్పరమ్మా

(॥॥)
కడుఁ దలలువంచుక కాఁగిట నించుకొనేరు
అడరి లోలోనే విడె మందుకొనేరు
యెడయక శ్రీవేంకటేశుఁ డింతయుఁ గూడిరి
బడిఁబడి దలుపు గొబ్బన మూయరమ్మా

(||pallavi||)
sittamu lĕrim̐gi sevaseyarammā
pŏttula buvvānagu pŏsam̐giṁcharammā

(||||)
pīm̐ṭamīm̐dam̐ gūsuṁḍi pĕṁḍlāḍi riddarunu
sīḍigimāḍigi naṭṭĕ siggubaḍeru
māḍalāḍiṁchi sūside maṁtanamāḍugŏneru
teḍalugā niṁtalonĕ tĕraveyarammā

(||||)
sedu lŏggiṁchugŏṁṭānu sesalu vĕṭṭugŏneru
podariṁchi sĕlavulam̐ būm̐si navveru
ghādala nŏgarŏgarim̐ gaḍagannulam̐ jūseru
nīdĕrim̐gi pachchaḍamu niṁḍam̐ gapparammā

(||||)
kaḍum̐ dalaluvaṁchuga kām̐giḍa niṁchugŏneru
aḍari lolone viḍĕ maṁdugŏneru
yĕḍayaga śhrīveṁkaḍeśhum̐ ḍiṁtayum̐ gūḍiri
baḍim̐baḍi dalubu gŏbbana mūyarammā