చిత్తమెట్టున్నదోకాని చెప్ప వెరపయ్యీ నాకు
(॥పల్లవి॥)
చిత్తమెట్టున్నదోకాని చెప్ప వెరపయ్యీ నాకు
మొత్తాన నూరకేవుంటే మోసమౌఁబో యిపుడు
(॥చిత్త॥)
తొయ్యలిచెక్కునుఁ జేయీ దొంతరతామరలాయ
వొయ్యనె నీవిరహసూర్యోదయవేళ
నెయ్యపునీనవ్వుల వెన్నెలఁ గొంతచిలికితే
చయ్యన వానివాఁడి సమసుఁబో యిపుడే
(॥చిత్త॥)
అంగన మోనాన మోవు లమడమంకెనలాయ
భంగపుఁగోరికల ప్రభాతవేళ
అంగపునీమాటల పయ్యెద గొంతవిసరితే
వెంగలి వానిగుట్టు విరియుఁబో యిపుడె
(॥చిత్త,॥)
కాంతమేను నీమేను కదంబపుఁబువ్వులాయ
ఇంతలో శ్రీవేంకటేశ యీకెఁ గూడఁగా
పొంతల మీరిద్దరును పొంది యెడయకుండితే
బంతినే వాసనలంకెపాటు లౌఁబో యిపుడె
(||pallavi||)
sittamĕṭṭunnadogāni sĕppa vĕrabayyī nāgu
mŏttāna nūragevuṁṭe mosamaum̐bo yibuḍu
(||sitta||)
tŏyyalisĕkkunum̐ jeyī dŏṁtaradāmaralāya
vŏyyanĕ nīvirahasūryodayaveḽa
nĕyyabunīnavvula vĕnnĕlam̐ gŏṁtasiligide
sayyana vānivām̐ḍi samasum̐bo yibuḍe
(||sitta||)
aṁgana monāna movu lamaḍamaṁkĕnalāya
bhaṁgabum̐gorigala prabhādaveḽa
aṁgabunīmāḍala payyĕda gŏṁtavisaride
vĕṁgali vāniguṭṭu viriyum̐bo yibuḍĕ
(||sitta,||)
kāṁtamenu nīmenu kadaṁbabum̐buvvulāya
iṁtalo śhrīveṁkaḍeśha yīgĕm̐ gūḍam̐gā
pŏṁtala mīriddarunu pŏṁdi yĕḍayaguṁḍide
baṁtine vāsanalaṁkĕbāḍu laum̐bo yibuḍĕ