Sittameṟimgi sevalu seyudagaaga

చిత్తమెఱిఁగి సేవలు సేయుటగాక
Language

(॥పల్లవి॥)
చిత్తమెఱిఁగి సేవలు సేయుటగాక
హత్తి నీతోడఁ బెనఁగి అలఇంచఁదగవా

(॥చిత్త॥)
యెంతచనవరినైనా యింతి నింతె నీకు నేను
చింత నీ మోవి యెంగిలి సేయవచ్చునా
వింతసతు లెఱుంగక వెక్కసానఁ బైకనినా
పంతమాడి ఇందరిలోఁ బచ్చిసేయఁదగవా

(॥చిత్త॥)
నీవెంత మన్నించినా నే నూడిగపుదాననే
వేవేలైనాఁగాలు నీపై వేయవచ్చునా
కావరించి నిన్ను జారకామిను లెట్టుచేసినా
యీవిధాన మాకునెల్లా నెమ్మె చూపఁదగవా

(॥చిత్త॥)
అక్కున నెంత వుండినా అలమేలుమంగ నేను
వుక్కువంటిచన్నుల నిన్నొత్తవచ్చునా
యెక్కడివారు నీకున్నా యేలితివి నన్ను నేఁడు
గక్కున శ్రీ వేంకటేశ కడుమీరఁదగవా

(||pallavi||)
sittamĕṟim̐gi sevalu seyuḍagāga
hatti nīdoḍam̐ bĕnam̐gi ala̮iṁcham̐dagavā

(||sitta||)
yĕṁtasanavarinainā yiṁti niṁtĕ nīgu nenu
siṁta nī movi yĕṁgili seyavachchunā
viṁtasadu lĕṟuṁgaga vĕkkasānam̐ baiganinā
paṁtamāḍi iṁdarilom̐ bachchiseyam̐dagavā

(||sitta||)
nīvĕṁta manniṁchinā ne nūḍigabudānane
vevelainām̐gālu nībai veyavachchunā
kāvariṁchi ninnu jāragāminu lĕṭṭusesinā
yīvidhāna māgunĕllā nĕmmĕ sūbam̐dagavā

(||sitta||)
akkuna nĕṁta vuṁḍinā alamelumaṁga nenu
vukkuvaṁṭisannula ninnŏttavachchunā
yĕkkaḍivāru nīgunnā yelidivi nannu nem̐ḍu
gakkuna śhrī veṁkaḍeśha kaḍumīram̐dagavā