Sittameṟamgaga lolo siggudoda nunnadaana

చిత్తమెఱఁగక లోలో సిగ్గుతోడ నున్నదాన
Language

(॥పల్లవి॥)
చిత్తమెఱఁగక లోలో సిగ్గుతోడ నున్నదాన
హత్తి నాకు నన్నిటికి నప్పణియ్యవయ్యా

(॥చిత్త॥)
సందడించి నీతోను సరసములాడఁగాను
అందరిలో మందెమేళ మనవుగదా
చెందినవూడిగాలు నీకుఁ జెలరేఁగి సేయఁగాను
యెందుకో లాచీనని యెంచవుగదా

(॥చిత్త॥)
గుట్టుతోడ నేపొద్దు కొలువులు సేయఁగాను
అట్టె వలపించవచ్చె ననవుగదా
చుట్టి చుట్టి నీతోను సుద్దులెల్లాఁ జెప్పఁగాను
బట్టబయ లీఁతలని భావించవు గదా

(॥చిత్త॥)
సరుస గూచుండి మోవిచవులు నిన్నడుగఁగా
అరుదంది యాసకతై ననవుగదా
ఇరవై నన్ను శ్రీవేంకటేశ ఇట్టె కూడితివి
వొరసితే చన్నులకు నొడ్డించుకోవుగదా

(||pallavi||)
sittamĕṟam̐gaga lolo siggudoḍa nunnadāna
hatti nāgu nanniḍigi nappaṇiyyavayyā

(||sitta||)
saṁdaḍiṁchi nīdonu sarasamulāḍam̐gānu
aṁdarilo maṁdĕmeḽa manavugadā
sĕṁdinavūḍigālu nīgum̐ jĕlarem̐gi seyam̐gānu
yĕṁdugo lāsīnani yĕṁchavugadā

(||sitta||)
guṭṭudoḍa nebŏddu kŏluvulu seyam̐gānu
aṭṭĕ valabiṁchavachchĕ nanavugadā
suṭṭi suṭṭi nīdonu suddulĕllām̐ jĕppam̐gānu
baṭṭabaya līm̐talani bhāviṁchavu gadā

(||sitta||)
sarusa gūsuṁḍi movisavulu ninnaḍugam̐gā
arudaṁdi yāsagadai nanavugadā
iravai nannu śhrīveṁkaḍeśha iṭṭĕ kūḍidivi
vŏraside sannulagu nŏḍḍiṁchugovugadā