Sittamemdumdeno yamtaa sibbidi padenu nenu

చిత్తమెందుండెనో యంటా సిబ్బితి పడేను నేను
Language

(॥పల్లవి॥)
చిత్తమెందుండెనో యంటా సిబ్బితి పడేను నేను
కొత్తలేమి గలిగినాఁ గోరి తెలుసుకొమ్మీ

(॥చిత్త॥)
నివ్వటిల్లి కొలువులో నీ వున్న బావము చూచి
యెవ్వతె యేమాడునో యేమిసేసునో
పువ్వువలెఁ బొదుగుదు భోగించేవేళ నేను
నవ్వుల నీ మై రేకలు నావిగావు సుమ్మీ

(॥చిత్త॥)
వూరివారి సొమ్ములెల్ల నొగిఁ బెట్టుక రాఁగాను
యేరీతినున్నాఁడవో నాకెట్టు దెలుసు
నేరుపుతో సింగారింతు నీమేను సోఁకేటివేళ
భారపు దండలు నాకుఁ బనిలేదు సుమ్మీ

(॥చిత్త॥)
సందడి నీ మోమునకు సరికళలు రేఁగెను
యెందుఁ గలదో మోహమెరుఁగుదునా
పొందితి శ్రీ వెంకటేశ పొరపొచ్చెము లేకుండ
విందుల నీ మోవితేనె వేరుసేయ సుమ్మీ

(||pallavi||)
sittamĕṁduṁḍĕno yaṁṭā sibbidi paḍenu nenu
kŏttalemi galiginām̐ gori tĕlusugŏmmī

(||sitta||)
nivvaḍilli kŏluvulo nī vunna bāvamu sūsi
yĕvvadĕ yemāḍuno yemisesuno
puvvuvalĕm̐ bŏdugudu bhogiṁcheveḽa nenu
navvula nī mai regalu nāvigāvu summī

(||sitta||)
vūrivāri sŏmmulĕlla nŏgim̐ bĕṭṭuga rām̐gānu
yerīdinunnām̐ḍavo nāgĕṭṭu dĕlusu
nerubudo siṁgāriṁtu nīmenu som̐keḍiveḽa
bhārabu daṁḍalu nāgum̐ baniledu summī

(||sitta||)
saṁdaḍi nī momunagu sarigaḽalu rem̐gĕnu
yĕṁdum̐ galado mohamĕrum̐gudunā
pŏṁdidi śhrī vĕṁkaḍeśha pŏrabŏchchĕmu leguṁḍa
viṁdula nī movidenĕ veruseya summī