చిత్తజగురుఁడ నీకు శ్రీమంగళం నా
(॥పల్లవి॥)
చిత్తజగురుఁడ నీకు శ్రీమంగళం నా-
చిత్తములో హరి నీకు శ్రీమంగళం
(॥చిత్త॥)
బంగారుబొమ్మవంటి పణతి నీ యురముపై
సింగారించిన నీకు శ్రీమంగళం
రంగుమీఱఁ బీతాంబరము మొలఁ గట్టుకొని
చెంగలించే హరి నీకు శ్రీమంగళం
(॥చిత్త॥)
అంత నీలములవంటి వెలఁదిని పాదముల
చెంతఁ బుట్టించిన నీకు శ్రీమంగళం
(॥చిత్త॥)
అరిది పచ్చలవంటియాకుల అంగననీ
శిరసుపై నున్న నీకు శ్రీమంగళం
గరిమ శ్రీ వేంకటేశ ఘన సంపదలతోడి
సిరివర నీకు నిదె శ్రీమంగళం
(||pallavi||)
sittajagurum̐ḍa nīgu śhrīmaṁgaḽaṁ nā-
sittamulo hari nīgu śhrīmaṁgaḽaṁ
(||sitta||)
baṁgārubŏmmavaṁṭi paṇadi nī yuramubai
siṁgāriṁchina nīgu śhrīmaṁgaḽaṁ
raṁgumīṟam̐ bīdāṁbaramu mŏlam̐ gaṭṭugŏni
sĕṁgaliṁche hari nīgu śhrīmaṁgaḽaṁ
(||sitta||)
aṁta nīlamulavaṁṭi vĕlam̐dini pādamula
sĕṁtam̐ buṭṭiṁchina nīgu śhrīmaṁgaḽaṁ
(||sitta||)
aridi pachchalavaṁṭiyāgula aṁgananī
śhirasubai nunna nīgu śhrīmaṁgaḽaṁ
garima śhrī veṁkaḍeśha ghana saṁpadaladoḍi
sirivara nīgu nidĕ śhrīmaṁgaḽaṁ