Sittajagurumda neegu shreemamgalam | naa

చిత్తజగురుఁడ నీకు శ్రీమంగళం । నా
Language

(॥పల్లవి॥)
చిత్తజగురుఁడ నీకు శ్రీమంగళం । నా-
చిత్తములో హరి నీకు శ్రీమంగళం

(॥చిత్త॥)
బంగారు బొమ్మవంటి పడఁతి నురముమీఁద
సింగారించిన నీకు శ్రీమంగళం
రంగుమీరఁ బీతాంబరము మొలఁగట్టుకొని
చెంగలించేరి నీకు శ్రీమంగళం

(॥చిత్త॥)
వింతనీలములవంటివెలఁది నీపాదముల-
చెంతఁ బుట్టించిన నీకు శ్రీమంగళం
కాంతులకౌస్తుభమణి గట్టుక భక్తుల కెల్లాఁ
జింతామణివైన నీకు శ్రీమంగళం

(॥చిత్త॥)
అరిది పచ్చల వంటియంగన శిరసుమీఁద
సిరులఁ దాల్చిన నీకు శ్రీమంగళం
గరిమ శ్రీవేంకటేశ ఘన సంపదలతోడి-
సిరివర నీకు నిదె శ్రీమంగళం

(||pallavi||)
sittajagurum̐ḍa nīgu śhrīmaṁgaḽaṁ | nā-
sittamulo hari nīgu śhrīmaṁgaḽaṁ

(||sitta||)
baṁgāru bŏmmavaṁṭi paḍam̐ti nuramumīm̐da
siṁgāriṁchina nīgu śhrīmaṁgaḽaṁ
raṁgumīram̐ bīdāṁbaramu mŏlam̐gaṭṭugŏni
sĕṁgaliṁcheri nīgu śhrīmaṁgaḽaṁ

(||sitta||)
viṁtanīlamulavaṁṭivĕlam̐di nībādamula-
sĕṁtam̐ buṭṭiṁchina nīgu śhrīmaṁgaḽaṁ
kāṁtulagaustubhamaṇi gaṭṭuga bhaktula kĕllām̐
jiṁtāmaṇivaina nīgu śhrīmaṁgaḽaṁ

(||sitta||)
aridi pachchala vaṁṭiyaṁgana śhirasumīm̐da
sirulam̐ dālsina nīgu śhrīmaṁgaḽaṁ
garima śhrīveṁkaḍeśha ghana saṁpadaladoḍi-
sirivara nīgu nidĕ śhrīmaṁgaḽaṁ