Sittagimtuvu raavayyaa sillarabaraagu maani

చిత్తగింతువు రావయ్యా చిల్లరపరాకు మాని
Language

(॥పల్లవి॥)
చిత్తగింతువు రావయ్యా చిల్లరపరాకు మాని
హత్తి తారుకాణ వచ్చీనప్పుడే నీకు

(॥॥)
చిగురాకు మోవిమీఁదఁ జెలి యీడేమాఁటలు
మిగులాఁ దేనెలకంటే మించుఁదీపులు
జిగిమించ నీతోడఁ జేసేటిచెలుములు
చిగురుఁగండెలకంటెఁ జిక్కించేబందనలు

(॥॥)
తమ్మిరేకుఁగన్నులలోఁ దళుకనేచూపులు
తుమ్మిదపౌఁజులకంటేఁ దూరిపారును
వుమ్మగిలుఁబయ్యదలో నుండేటికుచములు
నిమ్మపండ్లు కంటేను నీకుఁ గానుకలౌను

(॥॥)
లతలచేతులు చాఁచి లాచేటికాఁగిలి
రతిఁ బెండ్లిచవికకంటే రమ్యమైనది
యితివై శ్రీవేంకటేశ యేలితివి నీమోహపుఁ
సతికంటే నెక్కుడు జాణతనాలు

(||pallavi||)
sittagiṁtuvu rāvayyā sillarabarāgu māni
hatti tārugāṇa vachchīnappuḍe nīgu

(||||)
sigurāgu movimīm̐dam̐ jĕli yīḍemām̐ṭalu
migulām̐ denĕlagaṁṭe miṁchum̐dībulu
jigimiṁcha nīdoḍam̐ jeseḍisĕlumulu
sigurum̐gaṁḍĕlagaṁṭĕm̐ jikkiṁchebaṁdanalu

(||||)
tammiregum̐gannulalom̐ daḽuganesūbulu
tummidabaum̐julagaṁṭem̐ dūribārunu
vummagilum̐bayyadalo nuṁḍeḍigusamulu
nimmabaṁḍlu kaṁṭenu nīgum̐ gānugalaunu

(||||)
ladalasedulu sām̐si lāseḍigām̐gili
radim̐ bĕṁḍlisavigagaṁṭe ramyamainadi
yidivai śhrīveṁkaḍeśha yelidivi nīmohabum̐
sadigaṁṭe nĕkkuḍu jāṇadanālu