Sittagimtuvu raavayya seliyabaagulu nedu

చిత్తగింతువు రావయ్య చెలియబాగులు నేడు
Language

(॥పల్లవి॥)
చిత్తగింతువు రావయ్య చెలియబాగులు నేడు
ఇత్తల విన్నవించ నేనెంత దానను

(॥చిత్త॥)
వలిపపయ్యదలోని వట్రువచనుగుబ్బలు
తొలుత నీకాఁగిలి కెదురుచూచేయట్టున్నవి
తిలకించి నీదేవులతేనెలయధరములు
చెలఁగి నీకు విందులుచెప్పేయట్టున్నవి

(॥చిత్త॥)
వెక్కసపుఁదళుకుల వెడదకన్నులచూపు
మిక్కిలి నిన్నుఁ బూజించ మీఁదె త్తినట్టున్నది
తక్కళ ఇంతిచేతులు తలఁబాలు వోయ నీపై-
నుక్కుమీర సూత్రవెట్టి వొడ్డినట్టున్నవి

(॥చిత్త॥)
నెమ్మది శ్రీవేంకటేశ నీ కలమేల్మంగ మేను
కమ్మి నీమెడఁ దాళిగాఁ గట్టేయట్టున్నది
పమ్మి నీవే దయంజూచి పడఁతిఁ గూడితి విట్టె
వుమ్మడా నీకు నీపె వొనరినట్టున్నది

(||pallavi||)
sittagiṁtuvu rāvayya sĕliyabāgulu neḍu
ittala vinnaviṁcha nenĕṁta dānanu

(||sitta||)
valibabayyadaloni vaṭruvasanugubbalu
tŏluda nīgām̐gili kĕdurusūseyaṭṭunnavi
tilagiṁchi nīdevuladenĕlayadharamulu
sĕlam̐gi nīgu viṁdulusĕppeyaṭṭunnavi

(||sitta||)
vĕkkasabum̐daḽugula vĕḍadagannulasūbu
mikkili ninnum̐ būjiṁcha mīm̐dĕ ttinaṭṭunnadi
takkaḽa iṁtisedulu talam̐bālu voya nībai-
nukkumīra sūtravĕṭṭi vŏḍḍinaṭṭunnavi

(||sitta||)
nĕmmadi śhrīveṁkaḍeśha nī kalamelmaṁga menu
kammi nīmĕḍam̐ dāḽigām̐ gaṭṭeyaṭṭunnadi
pammi nīve dayaṁjūsi paḍam̐tim̐ gūḍidi viṭṭĕ
vummaḍā nīgu nībĕ vŏnarinaṭṭunnadi