చిత్తగింతువు రావయ్య చెలికడకు
(॥పల్లవి॥)
చిత్తగింతువు రావయ్య చెలికడకు
పొత్తుల తలపోఁతల బోగించీని
(॥॥)
మనసు నిలుపరాక మాటలనుఁ బొద్దువోక
వొనరి విరహమున నున్నది చెలి
కొనలుసాగిన యాస కొప్పునఁ బెట్టేసేసఁ
దనివోక కూటమికిఁ దమకించీని
(॥॥)
చెమటలఁ దొప్పఁదోఁగి సిగ్గులనే కడుమాఁగి
అమరినజవ్వనాన నలసీఁ జెలి
తిమురువలపులను తియ్యనసొలపులను
జమళిపులకలతో జాజుకొనీని
(॥॥)
యెదురుచూపులు చూచి యిచ్చె కాఁగిటికి లాచి
ముదమునఁ జేతులెత్తి మొక్కీఁ జెలి
అదన శ్రీ వేంకటేశ అట్టె నీవు గూడఁగాను
వుదుటుఁగళలు రేఁగి వూరుపు లాఁగీని
(||pallavi||)
sittagiṁtuvu rāvayya sĕligaḍagu
pŏttula talabom̐tala bogiṁchīni
(||||)
manasu nilubarāga māḍalanum̐ bŏdduvoga
vŏnari virahamuna nunnadi sĕli
kŏnalusāgina yāsa kŏppunam̐ bĕṭṭesesam̐
danivoga kūḍamigim̐ damagiṁchīni
(||||)
sĕmaḍalam̐ dŏppam̐dom̐gi siggulane kaḍumām̐gi
amarinajavvanāna nalasīm̐ jĕli
timuruvalabulanu tiyyanasŏlabulanu
jamaḽibulagalado jājugŏnīni
(||||)
yĕdurusūbulu sūsi yichchĕ kām̐giḍigi lāsi
mudamunam̐ jedulĕtti mŏkkīm̐ jĕli
adana śhrī veṁkaḍeśha aṭṭĕ nīvu gūḍam̐gānu
vuduḍum̐gaḽalu rem̐gi vūrubu lām̐gīni