Sittagimchumide seliya vilaasamu

చిత్తగించుమిదె చెలియ విలాసము
Language

(॥పల్లవి॥)
చిత్తగించుమిదె చెలియ విలాసము
పొత్తులు గలపీ భోగంబులకు

(॥చిత్త॥)
వెన్నెలరేకులు వెదచల్నీ నదె
సన్నల సలవుల సకియా
కన్నులమొక్కులు కానుకలొసఁగీ
నిన్నుఁ జూచి యిదె నివ్వెరగులను

(॥చిత్త॥)
జక్కవపిట్టల సంతముసేసీ
అక్కున గప్పుచు నతివా
చక్కనిమోవిని చవులటు గొలిపీ
నెక్కొని నీపై నేస్తంబులను

(॥చిత్త॥)
పలుకుఁ దేనియలు పలుమరుఁ జిలికీ
మెలుపురతుల నలమేల్ మంగ
యెలమిని శ్రీవేంకటేశ కూడితివి
అలరీ నీతో నదె సరసములా

(||pallavi||)
sittagiṁchumidĕ sĕliya vilāsamu
pŏttulu galabī bhogaṁbulagu

(||sitta||)
vĕnnĕlaregulu vĕdasalnī nadĕ
sannala salavula sagiyā
kannulamŏkkulu kānugalŏsam̐gī
ninnum̐ jūsi yidĕ nivvĕragulanu

(||sitta||)
jakkavabiṭṭala saṁtamusesī
akkuna gappusu nadivā
sakkanimovini savulaḍu gŏlibī
nĕkkŏni nībai nestaṁbulanu

(||sitta||)
palugum̐ deniyalu palumarum̐ jiligī
mĕluburadula nalamel maṁga
yĕlamini śhrīveṁkaḍeśha kūḍidivi
alarī nīdo nadĕ sarasamulā