Sittagimchu tamagame simmiremse lolona

చిత్తగించు తమకమే చిమ్మిరేఁచె లోలోన
Language

(॥పల్లవి॥)
చిత్తగించు తమకమే చిమ్మిరేఁచె లోలోన
మత్తగజగమనను మన్నించవయ్యా

(॥॥)
వలపు నిలుపలేక వనిత నిన్నుఁజూచి
పలుకులఁగొసరీని పలుమారును
చలివాసి యప్పటిని సరసములాడీని
నిలుచుండి చేయిచాఁచీ నీమీఁదను

(॥॥)
విరహ మాఁపఁగలేక వెలఁది నీయెదుటను
నిరతిఁగొలువుసేసీ నెయ్యమునను
వొరసి వొరసి మరి వూడిగాలు సేసిని
పరిపరివిధముల బాఁతిపడీ నిపుడు

(॥॥)
ఆసలు విడువలేక అలమేలుమంగ నిన్ను
సేసవెట్టి కూడీని శ్రీ వేంకటేశ
తాసువలెఁ బెనఁగీని తరితీపు సేసీని
మూసినముత్యమువలె మొక్కు మొక్కీనీకును

(||pallavi||)
sittagiṁchu tamagame simmirem̐sĕ lolona
mattagajagamananu manniṁchavayyā

(||||)
valabu nilubalega vanida ninnum̐jūsi
palugulam̐gŏsarīni palumārunu
salivāsi yappaḍini sarasamulāḍīni
nilusuṁḍi seyisām̐sī nīmīm̐danu

(||||)
viraha mām̐pam̐galega vĕlam̐di nīyĕduḍanu
niradim̐gŏluvusesī nĕyyamunanu
vŏrasi vŏrasi mari vūḍigālu sesini
paribarividhamula bām̐tibaḍī nibuḍu

(||||)
āsalu viḍuvalega alamelumaṁga ninnu
sesavĕṭṭi kūḍīni śhrī veṁkaḍeśha
tāsuvalĕm̐ bĕnam̐gīni taridību sesīni
mūsinamutyamuvalĕ mŏkku mŏkkīnīgunu