చిత్తగించు రమణుఁడ చేరి యెడమాటలేల
(॥పల్లవి॥)
చిత్తగించు రమణుఁడ చేరి యెడమాటలేల
చిత్తరుపతిమను నీ చిత్తము నా భాగ్యము
(॥చిత్త॥)
చొప్పగు నా వలపు చూపిచెప్పరాదు నన్నుఁ
గప్పి కాఁగిలించుకొంటేఁ గానవచ్చీని
వుప్పతించ నే నేర వూరకుండఁగాఁ జెమట
చిప్పిలీ నామేనను నీచిత్తము నాభాగ్యము
(॥చిత్త॥)
అందికూడేతరితీపు అంతిం తనఁగరాదు
కందువ నీవంటఁగానే కానవచ్చీని
మందలించ నే నేర మరిగి నే నుండఁగాను
చిందేటి జవ్వనిని నీ చిత్తము నాభాగ్యము
(॥చిత్త॥)
చొక్కననా వేడుకలు సూడిదిపట్టఁగరాదు
గక్కన నీ వెనసితేఁ గానవచ్చీని
వొక్కటైతివి శ్రీ వేంకటోత్తమునే మెచ్చనేర
చిక్కి నీకు నుండఁగా నీచిత్తము నాభాగ్యము
(||pallavi||)
sittagiṁchu ramaṇum̐ḍa seri yĕḍamāḍalela
sittarubadimanu nī sittamu nā bhāgyamu
(||sitta||)
sŏppagu nā valabu sūbisĕpparādu nannum̐
gappi kām̐giliṁchugŏṁṭem̐ gānavachchīni
vuppadiṁcha ne nera vūraguṁḍam̐gām̐ jĕmaḍa
sippilī nāmenanu nīsittamu nābhāgyamu
(||sitta||)
aṁdigūḍedaridību aṁtiṁ tanam̐garādu
kaṁduva nīvaṁṭam̐gāne kānavachchīni
maṁdaliṁcha ne nera marigi ne nuṁḍam̐gānu
siṁdeḍi javvanini nī sittamu nābhāgyamu
(||sitta||)
sŏkkananā veḍugalu sūḍidibaṭṭam̐garādu
gakkana nī vĕnasidem̐ gānavachchīni
vŏkkaḍaidivi śhrī veṁkaḍottamune mĕchchanera
sikki nīgu nuṁḍam̐gā nīsittamu nābhāgyamu