చిత్తగించు రమణుఁడ చెలిమొగమై నీవు
(॥పల్లవి॥)
చిత్తగించు రమణుఁడ చెలిమొగమై నీవు
చిత్తజు కేలికిని సింగారించుకొన్నది
(॥॥)
నిమ్మపండ్లంతలేసి నిక్కినచన్నులు నీకు
వుమ్మడిఁ గానుక పట్టుకున్నదిచెలి
తమ్మిదపౌఁజుల కొప్పు తోడుచూపేనంటాను
పమ్మి పచారించుకొని పనివడి యున్నది
(॥॥)
తేనెపెరవంటిది తియ్యనిమోవి నీకు
వూనివిందువెట్టేనని వున్నది చెలి
వూనికనుఁ గలువలు పూజసేసేనంటా నీకు
ఆనుకొని నీరాకకు అదె కాచుకున్నది
(॥॥)
కరికుంభఘనపు గజరాజలక్ష్మిని
వొరసి నీసొమ్ము చేకున్నది చెలి
యిరవై శ్రీవేంకటేశ యీకె నిట్టె కూడితివి
గొరబు కాఁగిటి కింకాఁ గోరుచున్నది
(||pallavi||)
sittagiṁchu ramaṇum̐ḍa sĕlimŏgamai nīvu
sittaju keligini siṁgāriṁchugŏnnadi
(||||)
nimmabaṁḍlaṁtalesi nikkinasannulu nīgu
vummaḍim̐ gānuga paṭṭugunnadisĕli
tammidabaum̐jula kŏppu toḍusūbenaṁṭānu
pammi pasāriṁchugŏni panivaḍi yunnadi
(||||)
tenĕbĕravaṁṭidi tiyyanimovi nīgu
vūniviṁduvĕṭṭenani vunnadi sĕli
vūniganum̐ galuvalu pūjasesenaṁṭā nīgu
ānugŏni nīrāgagu adĕ kāsugunnadi
(||||)
kariguṁbhaghanabu gajarājalakṣhmini
vŏrasi nīsŏmmu segunnadi sĕli
yiravai śhrīveṁkaḍeśha yīgĕ niṭṭĕ kūḍidivi
gŏrabu kām̐giḍi kiṁkām̐ gorusunnadi