Sittagimchu neegu nem jeppinadaananaa

చిత్తగించు నీకు నేఁ జెప్పినదాననా
Language

(॥పల్లవి॥)
చిత్తగించు నీకు నేఁ జెప్పినదాననా
యిత్తల నంతేసి నీ వెఱఁగనివాఁడవా

(॥చిత్త॥)
నీవు మన్నించదాన నీకు వలచినదాన
యీవల నల్లది నాతో యీడుజోడుదా
వావాత నావాదు నీవు వహించుకో కుంటేను
చేవలు మీరి నిన్ను మోచినదాఁకా రాదా

(॥చిత్త॥)
సేస వెట్టితిని నీవు చేయి చాఁచితి నేను
వాసితో నల్లది నాతో వంతు వచ్చేదా
బాసతో నాకుఁగా నీవు పట్టి పెనఁగ కుండితే
ఆసల నాస లని అందాఁకా రాదా

(॥చిత్త॥)
దక్కితివి నీకు నాకు తగు లైతి నే నీకు
మొక్కక అల్లది నాతో మొన చూపేదా
యిక్కువఁ గూడితివి నన్నిట్టె మెరయించకుంటే
నిక్కి శ్రీవెంకటేశ్వర నిన్ను ముట్టి రాదా

(||pallavi||)
sittagiṁchu nīgu nem̐ jĕppinadānanā
yittala naṁtesi nī vĕṟam̐ganivām̐ḍavā

(||sitta||)
nīvu manniṁchadāna nīgu valasinadāna
yīvala nalladi nādo yīḍujoḍudā
vāvāda nāvādu nīvu vahiṁchugo kuṁṭenu
sevalu mīri ninnu mosinadām̐kā rādā

(||sitta||)
sesa vĕṭṭidini nīvu seyi sām̐sidi nenu
vāsido nalladi nādo vaṁtu vachchedā
bāsado nāgum̐gā nīvu paṭṭi pĕnam̐ga kuṁḍide
āsala nāsa lani aṁdām̐kā rādā

(||sitta||)
dakkidivi nīgu nāgu tagu laidi ne nīgu
mŏkkaga alladi nādo mŏna sūbedā
yikkuvam̐ gūḍidivi nanniṭṭĕ mĕrayiṁchaguṁṭe
nikki śhrīvĕṁkaḍeśhvara ninnu muṭṭi rādā