చిత్తగించు నీ వీకెకు సింగారము
(॥పల్లవి॥)
చిత్తగించు నీ వీకెకు సింగారము
బత్తి సేసె నాపె నీకుఁ బాయని సింగారము
(॥చిత్త॥)
చెలియ మోమునకును చిరునవ్వు సింగారము
చిలుకుఁ జూపు కన్నుల సింగారము
కలితంపుఁజెక్కులకు కళలు సింగారము
లలిమీర నొసలి కలకలు సింగారము
(॥చిత్త॥)
ఉన్నతపు చన్నులకు నొరపు సింగారము
చిన్ననడిమికి నారు సింగారము
అన్నువ చేతులకు నొయ్యారి గోళ్ళే సింగారము
తిన్ననిమెడకు సోగతీరు సింగారము
(॥చిత్త॥)
నవకపుఁబాదాలకు నడపు సింగారము
చివురుమోవికి మించు సింగారము
తివిరి శ్రీ వేంకటేశ తెరవఁగూడితి విట్టే
సవరనిమేనికందచందమే సింగారము
(||pallavi||)
sittagiṁchu nī vīgĕgu siṁgāramu
batti sesĕ nābĕ nīgum̐ bāyani siṁgāramu
(||sitta||)
sĕliya momunagunu sirunavvu siṁgāramu
silugum̐ jūbu kannula siṁgāramu
kalidaṁpum̐jĕkkulagu kaḽalu siṁgāramu
lalimīra nŏsali kalagalu siṁgāramu
(||sitta||)
unnadabu sannulagu nŏrabu siṁgāramu
sinnanaḍimigi nāru siṁgāramu
annuva sedulagu nŏyyāri goḽḽe siṁgāramu
tinnanimĕḍagu sogadīru siṁgāramu
(||sitta||)
navagabum̐bādālagu naḍabu siṁgāramu
sivurumovigi miṁchu siṁgāramu
tiviri śhrī veṁkaḍeśha tĕravam̐gūḍidi viṭṭe
savaranimenigaṁdasaṁdame siṁgāramu