చిత్తగించు నీ వాపెను చెన్నరాయ! యీపె
(॥పల్లవి॥)
చిత్తగించు నీ వాపెను చెన్నరాయ! యీపె
చిత్తిణి గొడగుమఱ్ఱి చెన్నరాయ
(॥చిత్త॥)
చిక్కని గుబ్బల మీఁద చేయి నీవు వేసితేనే
చిక్కెను నీపాల నాపె చెన్నరాయ
చొక్కించి నీవు గోరు సోఁకించఁగా కమ్మటి నీ
చెక్కిటిపైఁ జేయివెట్టీ చెన్నరాయ
(॥చిత్త॥)
దిమ్మరి మాటలు యీ తెఱవతో నాడఁగాను
చెమ్మగిలఁ జెమరించె చెన్నరాయ
తమ్ములము నీ విడఁగ తమకించి యట్టె యాపె
చిమ్మెను నీమీఁదను సిగ్గు చెన్నరాయ
(॥చిత్త॥)
ఆ రీతుల నేకతాన అలుకలు దేర్చఁగాను
జీరలు వొళ్లెల్ల నిండె చెన్నరాయ
యీ రీతి శ్రీ వేంకటాద్రి నిద్దరు నేకమైతిరి
చీరకొంగు వదలకు చెన్నరాయ
(||pallavi||)
sittagiṁchu nī vābĕnu sĕnnarāya! yībĕ
sittiṇi gŏḍagumaṭri sĕnnarāya
(||sitta||)
sikkani gubbala mīm̐da seyi nīvu vesidene
sikkĕnu nībāla nābĕ sĕnnarāya
sŏkkiṁchi nīvu goru som̐kiṁcham̐gā kammaḍi nī
sĕkkiḍibaim̐ jeyivĕṭṭī sĕnnarāya
(||sitta||)
dimmari māḍalu yī tĕṟavado nāḍam̐gānu
sĕmmagilam̐ jĕmariṁchĕ sĕnnarāya
tammulamu nī viḍam̐ga tamagiṁchi yaṭṭĕ yābĕ
simmĕnu nīmīm̐danu siggu sĕnnarāya
(||sitta||)
ā rīdula negadāna alugalu dersam̐gānu
jīralu vŏḽlĕlla niṁḍĕ sĕnnarāya
yī rīdi śhrī veṁkaḍādri niddaru negamaidiri
sīragŏṁgu vadalagu sĕnnarāya