చిత్తగించు నాగుణము చెప్పితి నీకు
(॥పల్లవి॥)
చిత్తగించు నాగుణము చెప్పితి నీకు
బత్తిసేసి నీకు మీఁదెత్తితి నావయసు
(॥॥)
రారాఁపులదానఁ గాను రాతిగుండెదానఁ గాను
కోరి నీకు మోహించినకొమ్మను నేను
బీరము లాడుకోను; నీపేరు చెవుల వింటేను
నీరువలెఁ గరఁగును నెమ్మది నామనసు
(॥॥)
కుచ్చితపుదానఁ గాను కొసరేటిదానఁ గాను
ఇచ్చకమే నీకుఁ జేసే యింతిని నేను
చెచ్చెర మందెమేళాలు సేయను నిన్నుఁ జూచితే
పచ్చిమదన కళలఁ బరగు నామొగము
(॥॥)
యెరవులదానఁ గాను యెగ్గుపట్టేదానఁ గాను
మరిగిన యల మేలుమంగను నేను
యిరవై శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
బెరసి నీకాఁగిటనే పెరుగు నాచన్నులు
(||pallavi||)
sittagiṁchu nāguṇamu sĕppidi nīgu
battisesi nīgu mīm̐dĕttidi nāvayasu
(||||)
rārām̐puladānam̐ gānu rādiguṁḍĕdānam̐ gānu
kori nīgu mohiṁchinagŏmmanu nenu
bīramu lāḍugonu; nīberu sĕvula viṁṭenu
nīruvalĕm̐ garam̐gunu nĕmmadi nāmanasu
(||||)
kuchchidabudānam̐ gānu kŏsareḍidānam̐ gānu
ichchagame nīgum̐ jese yiṁtini nenu
sĕchchĕra maṁdĕmeḽālu seyanu ninnum̐ jūside
pachchimadana kaḽalam̐ baragu nāmŏgamu
(||||)
yĕravuladānam̐ gānu yĕggubaṭṭedānam̐ gānu
marigina yala melumaṁganu nenu
yiravai śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
bĕrasi nīgām̐giḍane pĕrugu nāsannulu