Sittagimchu mide seluvumdavu

చిత్తగించు మిదె చెలువుఁడవు
Language

(॥పల్లవి॥)
చిత్తగించు మిదె చెలువుఁడవు
మొత్తపు వలపులు ముంచీని

(॥చిత్త॥)
పుత్తడిఁ బోలినపొలఁతి నీ రూపము
చిత్తరువున వ్రాసీ నిదివో
గుత్తపు గుబ్బల గురిగా మోపుచు
బత్తులు చేసీఁ బలుమరును

(॥చిత్త॥)
వలరాజు ప్రతిమవంటిది నీపేరు
చలములఁ బలకలఁ జదివీని
అలరి వురంబున అచ్చుగా నొత్తుచు
సులభాన మోహము చూపీని

(॥చిత్త॥)
చక్కెర బొమ్మయినసతి నీకాఁగిలి
గక్కన కణఁజముగాఁ గట్టి
యిక్కువ శ్రీవేంకటేశ నిన్నెనయుచు
అక్కరదెలిపీ ననువుగను

(||pallavi||)
sittagiṁchu midĕ sĕluvum̐ḍavu
mŏttabu valabulu muṁchīni

(||sitta||)
puttaḍim̐ bolinabŏlam̐ti nī rūbamu
sittaruvuna vrāsī nidivo
guttabu gubbala gurigā mobusu
battulu sesīm̐ balumarunu

(||sitta||)
valarāju pradimavaṁṭidi nīberu
salamulam̐ balagalam̐ jadivīni
alari vuraṁbuna achchugā nŏttusu
sulabhāna mohamu sūbīni

(||sitta||)
sakkĕra bŏmmayinasadi nīgām̐gili
gakkana kaṇam̐jamugām̐ gaṭṭi
yikkuva śhrīveṁkaḍeśha ninnĕnayusu
akkaradĕlibī nanuvuganu