చిత్తగించు మౌబళేశ శ్రీసతివిలాసములు
(॥పల్లవి॥)
చిత్తగించు మౌబళేశ శ్రీసతివిలాసములు
ఇత్తలా నత్తలా మీకు నిచ్చకము లాయను
(॥చిత్త॥)
యెదురుఁగొండలపై నుండి ఇంతి మోము చూపితేను
అదియే నీకు నిలువుటద్ద మాయను
వదలుఁబయ్యదలోనివట్రువచన్ను లావేళ
కదిసి నీకుఁ జూపినకానుక లాయను
(॥చిత్త॥)
పొన్నలనీడలలోన పొలిఁతి నిన్నుఁ జూడగా
సన్నలగప్పురవువసంత మాయను
మన్ననదేవులు నీకై మాటలు నీతో నాడఁగ
వున్నతపుమీరతలు కుంకువ లాయను
(॥చిత్త॥)
చెంది భవనాళి దాఁటి చేతులు నీపై జాచఁగా
పొందుగా తమ్మివిరులపూజ లాయను
కందువ శ్రీవేంకటేశ కాఁగిట నాకె గూడఁగా
యెందు చూచినా వేడుక లెక్కు డాయను
(||pallavi||)
sittagiṁchu maubaḽeśha śhrīsadivilāsamulu
ittalā nattalā mīgu nichchagamu lāyanu
(||sitta||)
yĕdurum̐gŏṁḍalabai nuṁḍi iṁti momu sūbidenu
adiye nīgu niluvuḍadda māyanu
vadalum̐bayyadalonivaṭruvasannu lāveḽa
kadisi nīgum̐ jūbinagānuga lāyanu
(||sitta||)
pŏnnalanīḍalalona pŏlim̐ti ninnum̐ jūḍagā
sannalagappuravuvasaṁta māyanu
mannanadevulu nīgai māḍalu nīdo nāḍam̐ga
vunnadabumīradalu kuṁkuva lāyanu
(||sitta||)
sĕṁdi bhavanāḽi dām̐ṭi sedulu nībai jāsam̐gā
pŏṁdugā tammivirulabūja lāyanu
kaṁduva śhrīveṁkaḍeśha kām̐giḍa nāgĕ gūḍam̐gā
yĕṁdu sūsinā veḍuga lĕkku ḍāyanu