Sittagimchu maa maamta shreenarasimhaa

చిత్తగించు మా మాఁట శ్రీనరసింహా
Language

(॥పల్లవి॥)
చిత్తగించు మా మాఁట శ్రీనరసింహా
చిత్తజజనక వో శ్రీనరసింహా

(॥చిత్త॥)
చెలరేఁగి వున్నాఁడవు శ్రీ నరసింహా - నీకు
జెలులెల్లా మొక్కేరు శ్రీ నరసింహా
సెలవుల నవ్వేవిట్టే శ్రీ నరసింహా- నీకే
సెలవు మావలపులు శ్రీ నరసింహా

(॥చిత్త॥)
చిందీని మైఁజెమటలు శ్రీ నరసింహాఁ నిన్ను
జెందినది కడు జాణ శ్రీ నరసింహా
చెందమ్మి రేకుల గోళ్ళ శ్రీ నరసింహా- నీపై
చిందులెల్లా బాడేము శ్రీ నరసింహా

(॥చిత్త॥)
సిరినెరకాఁగిటి శ్రీ నరసింహా- మంచి
సిరుల నహోబలము శ్రీ నరసింహా
శిరసెత్తు శ్రీవెంకట శ్రీ నరసింహా
చెరలాటాలిఁకనేల శ్రీనరసింహా

(||pallavi||)
sittagiṁchu mā mām̐ṭa śhrīnarasiṁhā
sittajajanaga vo śhrīnarasiṁhā

(||sitta||)
sĕlarem̐gi vunnām̐ḍavu śhrī narasiṁhā - nīgu
jĕlulĕllā mŏkkeru śhrī narasiṁhā
sĕlavula navveviṭṭe śhrī narasiṁhā- nīge
sĕlavu māvalabulu śhrī narasiṁhā

(||sitta||)
siṁdīni maim̐jĕmaḍalu śhrī narasiṁhām̐ ninnu
jĕṁdinadi kaḍu jāṇa śhrī narasiṁhā
sĕṁdammi regula goḽḽa śhrī narasiṁhā- nībai
siṁdulĕllā bāḍemu śhrī narasiṁhā

(||sitta||)
sirinĕragām̐giḍi śhrī narasiṁhā- maṁchi
sirula nahobalamu śhrī narasiṁhā
śhirasĕttu śhrīvĕṁkaḍa śhrī narasiṁhā
sĕralāḍālim̐kanela śhrīnarasiṁhā