Sittagimchu maa maadalu shreenarasimha

చిత్తగించు మా మాటలు శ్రీనరసింహ
Language

(॥పల్లవి॥)
చిత్తగించు మా మాటలు శ్రీనరసింహ
చిత్తజజనక వో శ్రీనరసింహ

(॥చిత్త॥)
చెలరేఁగి యున్నాఁడవు శ్రీనరసింహ నీకు
చెలు లెల్లా మొక్కేరు శ్రీనరసింహ
సెలవుల నవ్వే రిట్టె శ్రీనరసింహ నీకె
సెలవు మా వలపు శ్రీనారసింహ

(॥చిత్త॥)
చిందీని చెమటలు శ్రీనరసింహ నినుఁ
జెందీ నది కడుజాణ శ్రీనరసింహా
చెందమ్మిరేకుగోళ్ల శ్రీనరసింహ నీపై
చిందు లెల్లఁ బాడేము శ్రీనారసింహ

(॥చిత్త॥)
సిరి నెరగౌఁగిటి శ్రీనరసింహ మంచి
సిరుల యహోబల శ్రీనరసింహ
సిర నెత్తు శ్రీవేంకట శ్రీనారసింహ నీ
నెర బడివారము శ్రీనారసింహా

(||pallavi||)
sittagiṁchu mā māḍalu śhrīnarasiṁha
sittajajanaga vo śhrīnarasiṁha

(||sitta||)
sĕlarem̐gi yunnām̐ḍavu śhrīnarasiṁha nīgu
sĕlu lĕllā mŏkkeru śhrīnarasiṁha
sĕlavula navve riṭṭĕ śhrīnarasiṁha nīgĕ
sĕlavu mā valabu śhrīnārasiṁha

(||sitta||)
siṁdīni sĕmaḍalu śhrīnarasiṁha ninum̐
jĕṁdī nadi kaḍujāṇa śhrīnarasiṁhā
sĕṁdammiregugoḽla śhrīnarasiṁha nībai
siṁdu lĕllam̐ bāḍemu śhrīnārasiṁha

(||sitta||)
siri nĕragaum̐giḍi śhrīnarasiṁha maṁchi
sirula yahobala śhrīnarasiṁha
sira nĕttu śhrīveṁkaḍa śhrīnārasiṁha nī
nĕra baḍivāramu śhrīnārasiṁhā