Sittagimchi yemtigo vichchesidi gaaga

చిత్తగించి యేఁటికో విచ్చేసితి గాక
Language

(॥పల్లవి॥)
చిత్తగించి యేఁటికో విచ్చేసితి గాక
హత్తి నన్ను బుజ్జగించేవన్నిటా జాణవయ్యా

(॥చిత్త॥)
సరసమాడఁగ నీకు సతి శూర్పనఖ గద్దు
పొరిఁ జన్నిచ్చి పెంచఁగఁ బూతకి గద్దు
పొరసి కామించి నిన్ను భోగించఁ గుబ్జ గద్దు
తిరిగి మాయింటికి రాఁదీరునటవయ్యా

(॥చిత్త॥)
అంది నీకుఁ గావఁబో నావులమంద గలదు
కుంది వయ్యాళికి రాతిగుఱ్ఱము గద్దు
అందపుబోయిఁడవుగా నర్జునుని బండి గద్దు
దిందుపడి యీడకు రాఁదీరునటవయ్యా

(॥చిత్త॥)
సారెఁ బవళించఁ బాలజలనిధి నీకుఁ గద్దు
పోరచి దానమడుగ భూమి గద్దు
చేరి నిక్కిచూడ శ్రీవేంకటాద్రి గద్దు
తేరి నన్నుఁ గూడితివి తీరునటయ్యా

(||pallavi||)
sittagiṁchi yem̐ṭigo vichchesidi gāga
hatti nannu bujjagiṁchevanniḍā jāṇavayyā

(||sitta||)
sarasamāḍam̐ga nīgu sadi śhūrbanakha gaddu
pŏrim̐ jannichchi pĕṁcham̐gam̐ būdagi gaddu
pŏrasi kāmiṁchi ninnu bhogiṁcham̐ gubja gaddu
tirigi māyiṁṭigi rām̐dīrunaḍavayyā

(||sitta||)
aṁdi nīgum̐ gāvam̐bo nāvulamaṁda galadu
kuṁdi vayyāḽigi rādiguṭramu gaddu
aṁdabuboyim̐ḍavugā narjununi baṁḍi gaddu
diṁdubaḍi yīḍagu rām̐dīrunaḍavayyā

(||sitta||)
sārĕm̐ bavaḽiṁcham̐ bālajalanidhi nīgum̐ gaddu
porasi dānamaḍuga bhūmi gaddu
seri nikkisūḍa śhrīveṁkaḍādri gaddu
teri nannum̐ gūḍidivi tīrunaḍayyā