చిత్తగించి వినవయ్య శిరసు వంచఁగనేల
(॥పల్లవి॥)
చిత్తగించి వినవయ్య శిరసు వంచఁగనేల
బత్తితో నెచ్చరించితే భాగ్యము కాదా
(॥చిత్త॥)
వెలయ నారితేరినవేడుక కాఁడవు నీవు
చెలియ మాఁటల కేల సిగ్గుపడేవు
చెలరేఁగి తొల్లి నీవు సేసినచేఁతలే యవి
తలఁపంచితే నీకు తనివి గాదా
(॥చిత్త॥)
పేమతోఁ బదారువేలఁ బెండ్లాడినవాఁడవు
భామసుద్దుల నేల పరాకయ్యేవు
చేముంచి నీవు తొల్లి సేసినఛేంతలే యని
వేమారుఁ దడవితే విన నింపుగాదా
(॥చిత్త॥)
వెర వెరిఁగిన శ్రీవేంకటేశుఁడవు నీవు
తరుణిరతుల కేల తడఁబడేవు
సిరుల నీవు తొల్లిసేసినచేఁతలే యవి
సరి నీ కొప్పగించితే సంతోసముగాదా
(||pallavi||)
sittagiṁchi vinavayya śhirasu vaṁcham̐ganela
battido nĕchchariṁchide bhāgyamu kādā
(||sitta||)
vĕlaya nāriderinaveḍuga kām̐ḍavu nīvu
sĕliya mām̐ṭala kela siggubaḍevu
sĕlarem̐gi tŏlli nīvu sesinasem̐tale yavi
talam̐paṁchide nīgu tanivi gādā
(||sitta||)
pemadom̐ badāruvelam̐ bĕṁḍlāḍinavām̐ḍavu
bhāmasuddula nela parāgayyevu
semuṁchi nīvu tŏlli sesinachheṁtale yani
vemārum̐ daḍavide vina niṁpugādā
(||sitta||)
vĕra vĕrim̐gina śhrīveṁkaḍeśhum̐ḍavu nīvu
taruṇiradula kela taḍam̐baḍevu
sirula nīvu tŏllisesinasem̐tale yavi
sari nī kŏppagiṁchide saṁtosamugādā