చిత్తగించి వినవయ్య చెలికత్తియను నేను
(॥పల్లవి॥)
చిత్తగించి వినవయ్య చెలికత్తియను నేను
పొత్తుల మీ ఇద్దరికిఁ బొరగు మా నెలవు
(॥॥)
వింతలేక మాయింటికి వేగమే విచ్చేయవయ్య
కాంత నీకెదురువచ్చి కాచుకున్నది
మంతనాన వేడుకతో మన్నింతువు రావయ్య
పంతానఁ బానుపు మీఁదఁ బవ్వళించి వున్నది
(॥॥)
ఇరవై మావాకిటికి నిట్టే చనుదేవయ్య
తరుణి తొంగిచూపులఁ దతిగొన్నది
సరసములాడుటకు చయ్యన నరుదేవయ్య
తరమిడి నుద్యోగము దలపోయుచున్నది
(॥॥)
వొద్దిక మాలోఁగిటికి నొనగూడ రావయ్య
సుద్దులాలకించి ఇంతి చొక్కుచున్నది
గద్దరి శ్రీవేంకటేశ కాఁగిటఁ గూడితివిట్టే
ముద్దుల మాటల నీకు మొక్కుచున్నది
(||pallavi||)
sittagiṁchi vinavayya sĕligattiyanu nenu
pŏttula mī iddarigim̐ bŏragu mā nĕlavu
(||||)
viṁtalega māyiṁṭigi vegame vichcheyavayya
kāṁta nīgĕduruvachchi kāsugunnadi
maṁtanāna veḍugado manniṁtuvu rāvayya
paṁtānam̐ bānubu mīm̐dam̐ bavvaḽiṁchi vunnadi
(||||)
iravai māvāgiḍigi niṭṭe sanudevayya
taruṇi tŏṁgisūbulam̐ dadigŏnnadi
sarasamulāḍuḍagu sayyana narudevayya
taramiḍi nudyogamu dalaboyusunnadi
(||||)
vŏddiga mālom̐giḍigi nŏnagūḍa rāvayya
suddulālagiṁchi iṁti sŏkkusunnadi
gaddari śhrīveṁkaḍeśha kām̐giḍam̐ gūḍidiviṭṭe
muddula māḍala nīgu mŏkkusunnadi