Sittagimchi soodavayyaa selaa(la?)re(rem?)gi devulanu

చిత్తగించి చూడవయ్యా చెలా(ల?)రే(రేఁ?)గి దేవులను
Language

(॥పల్లవి॥)
చిత్తగించి చూడవయ్యా చెలా(ల?)రే(రేఁ?)గి దేవులను
యిత్తల నీకె సుద్దులు యెన్నెని చెప్పేమయా

(॥చిత్త॥)
కలికి నెమ్మొగమునఁ గాఁపుర ముండుఁ జంద్రుఁడు
వెలయ సెలవులను వెన్నెలగాయు
పలుకుల నేపొద్దు పచ్చి దేనియలుగారు
యిల నింతి చక్కఁదన మెంతని చెప్పేమయా

(॥చిత్త॥)
నిక్కి చనుఁగవతోడ నేస్తము సేయుఁ గొండలు
చొక్కపు మరుతూపులు చూపుల జోడు
నెక్కొని తురుమునందు నిండుఁ జీఁకట్లు గప్ప
యెక్కువ చెలిసింగారా లెంతని చెప్పేమయా

(॥చిత్త॥)
పడఁతి మేనిపై నెల్లా బంగారుపంటలు వండు
చిడుముడి బాదాలకు చిగురు దావు
కడఁగి శ్రీవేంకటేశ కాఁగిటఁ గూడితి విట్టె
యెడయ నీసతిభావా లెంతని చెప్పేమయా

(||pallavi||)
sittagiṁchi sūḍavayyā sĕlā(la?)re(rem̐?)gi devulanu
yittala nīgĕ suddulu yĕnnĕni sĕppemayā

(||sitta||)
kaligi nĕmmŏgamunam̐ gām̐pura muṁḍum̐ jaṁdrum̐ḍu
vĕlaya sĕlavulanu vĕnnĕlagāyu
palugula nebŏddu pachchi deniyalugāru
yila niṁti sakkam̐dana mĕṁtani sĕppemayā

(||sitta||)
nikki sanum̐gavadoḍa nestamu seyum̐ gŏṁḍalu
sŏkkabu marudūbulu sūbula joḍu
nĕkkŏni turumunaṁdu niṁḍum̐ jīm̐kaṭlu gappa
yĕkkuva sĕlisiṁgārā lĕṁtani sĕppemayā

(||sitta||)
paḍam̐ti menibai nĕllā baṁgārubaṁṭalu vaṁḍu
siḍumuḍi bādālagu siguru dāvu
kaḍam̐gi śhrīveṁkaḍeśha kām̐giḍam̐ gūḍidi viṭṭĕ
yĕḍaya nīsadibhāvā lĕṁtani sĕppemayā