Sittagimchi soodavayya sigurumbomdi dikku

చిత్తగించి చూడవయ్య చిగురుఁబోఁడి దిక్కు
Language

(॥పల్లవి॥)
చిత్తగించి చూడవయ్య చిగురుఁబోఁడి దిక్కు
బత్తి నీవు గల దాపె భాగ్యము కొలఁ దయ్యా

(॥చిత్తగించి॥)
చెలిచెమటల నాని చిత్తములో వలపులు
పులక లై మొలచెను బుజ కలిగే
యెలమిఁ గోరికె లై యీరికె లెత్తె నవే
బలుపంట లిక నీభాగ్యముకొలఁ దయ్యా

(॥చిత్తగించి॥)
అంగనవిరహవేళ నాయిటిగా లై వూర్పు
వెంగలితనాన నట్టె విసరఁ జొచ్చె
పొంగుచుఁ దూరు పెత్తంగఁ బొలివారె నివ్వెరగు
పంగులఁ గోరు వట్టు నీభాగయ్యకొలఁ దయ్యా

(॥చిత్త॥)
కామినికుచము లనేగాదలెను జవ్వనము
ఆమనికాలము పై పై నదె ముంచెను
చే ముంచి కూడితి విట్టె శ్రీవెంకటేశ యీపెను
భామకు నీకు రతులు భాగ్యముకొలఁ దయ్యా

(||pallavi||)
sittagiṁchi sūḍavayya sigurum̐bom̐ḍi dikku
batti nīvu gala dābĕ bhāgyamu kŏlam̐ dayyā

(||sittagiṁchi||)
sĕlisĕmaḍala nāni sittamulo valabulu
pulaga lai mŏlasĕnu buja kalige
yĕlamim̐ gorigĕ lai yīrigĕ lĕttĕ nave
balubaṁṭa liga nībhāgyamugŏlam̐ dayyā

(||sittagiṁchi||)
aṁganavirahaveḽa nāyiḍigā lai vūrbu
vĕṁgalidanāna naṭṭĕ visaram̐ jŏchchĕ
pŏṁgusum̐ dūru pĕttaṁgam̐ bŏlivārĕ nivvĕragu
paṁgulam̐ goru vaṭṭu nībhāgayyagŏlam̐ dayyā

(||sitta||)
kāminigusamu lanegādalĕnu javvanamu
āmanigālamu pai pai nadĕ muṁchĕnu
se muṁchi kūḍidi viṭṭĕ śhrīvĕṁkaḍeśha yībĕnu
bhāmagu nīgu radulu bhāgyamugŏlam̐ dayyā