చిత్తగించి చూడవయ్య సిగ్గువడ నీకేఁటికి
(॥పల్లవి॥)
చిత్తగించి చూడవయ్య సిగ్గువడ నీకేఁటికి
బత్తిసేసీ నాకె నీపై భావించవయ్యా
(॥॥)
సెలవుల నవ్వుతాను చేరి మాఁటలాడుతాను
పలువరుసలు చూపీఁ బడఁతి నీకు
నిలుగునివ్వెరగుతో నిండుసింగారములెల్లాఁ
బలుమారు నీముందరఁ బచరించీని
(॥॥)
కొప్పు చక్కఁబెట్టుకొంటా కొలువులు సేసుకొంటా
నెప్పునఁ జన్నుల నొ త్తీ నెలఁత నిన్ను
వుప్పతిల్లుఁగళలతో నుడివోనిజవ్వనాన
కుప్పళించి వలపులు గురిసీ నీయెదుట
(॥॥)
సరులు దిద్దుకొనుచు చవులెల్లా మోవిఁ జూపి
మరిగించీ నల మేలుమంగ నిన్నును
ఇరవై శ్రీ వేంకటేశ యిటు నన్ను నేలితివి
వురముపై నుండి యాపె వుబ్బించీ నీమనసు
(||pallavi||)
sittagiṁchi sūḍavayya sigguvaḍa nīgem̐ṭigi
battisesī nāgĕ nībai bhāviṁchavayyā
(||||)
sĕlavula navvudānu seri mām̐ṭalāḍudānu
paluvarusalu sūbīm̐ baḍam̐ti nīgu
nilugunivvĕragudo niṁḍusiṁgāramulĕllām̐
balumāru nīmuṁdaram̐ basariṁchīni
(||||)
kŏppu sakkam̐bĕṭṭugŏṁṭā kŏluvulu sesugŏṁṭā
nĕppunam̐ jannula nŏ ttī nĕlam̐ta ninnu
vuppadillum̐gaḽalado nuḍivonijavvanāna
kuppaḽiṁchi valabulu gurisī nīyĕduḍa
(||||)
sarulu diddugŏnusu savulĕllā movim̐ jūbi
marigiṁchī nala melumaṁga ninnunu
iravai śhrī veṁkaḍeśha yiḍu nannu nelidivi
vuramubai nuṁḍi yābĕ vubbiṁchī nīmanasu