Sittagimchi soodavayya seliya dikku

చిత్తగించి చూడవయ్య చెలియ దిక్కు
Language

(॥పల్లవి॥)
చిత్తగించి చూడవయ్య చెలియ దిక్కు
కొత్తలై నీ వేడుకలు గుబ్బతిలీని

(॥చిత్త॥)
చెలులముందర నెల్లాఁ జెప్ప సిగ్గువడీఁ గానీ
తలఁపులో తమకము దైలువారీని
బలుచన్నులు వలిపెపయ్యదఁ గప్పీఁ గాని
పెలుచువ యోమదము పిక్కటిల్లీని

(॥చిత్త॥)
గుఱిలేనివలపులు గుట్టున దాఁచీఁ గానీ
కఱఁగి మేనఁ జెమట గడుఁ గారీని
చిఱునవ్వు లూరకే సెలవి నణఁచీఁ గానీ
తొఱలింపుఁగోరికలు తూరిపారీని

(॥చిత్త॥)
తెగరానిపంతముతోఁ దెరవేసుకొనిఁ గానీ
చిగిరింపురతులలోఁ జిమ్మిరేఁగీని
నిగిడి శ్రీవేంకటేశ నీ వింతలోఁ గూడితివి
పగటు మోముకళలఁ బచ్చిదేరీని

(||pallavi||)
sittagiṁchi sūḍavayya sĕliya dikku
kŏttalai nī veḍugalu gubbadilīni

(||sitta||)
sĕlulamuṁdara nĕllām̐ jĕppa sigguvaḍīm̐ gānī
talam̐pulo tamagamu dailuvārīni
balusannulu valibĕbayyadam̐ gappīm̐ gāni
pĕlusuva yomadamu pikkaḍillīni

(||sitta||)
guṟilenivalabulu guṭṭuna dām̐sīm̐ gānī
kaṟam̐gi menam̐ jĕmaḍa gaḍum̐ gārīni
siṟunavvu lūrage sĕlavi naṇam̐sīm̐ gānī
tŏṟaliṁpum̐gorigalu tūribārīni

(||sitta||)
tĕgarānibaṁtamudom̐ dĕravesugŏnim̐ gānī
sigiriṁpuradulalom̐ jimmirem̐gīni
nigiḍi śhrīveṁkaḍeśha nī viṁtalom̐ gūḍidivi
pagaḍu momugaḽalam̐ bachchiderīni