చిత్తగించి చూడవయ్య చెలి లాగు
(॥పల్లవి॥)
చిత్తగించి చూడవయ్య చెలి లాగు
బిత్తరపు జవ్వనము పెచ్చుపెరిగీని
(॥॥)
చెలివీనులజవ్వాది చెక్కులఁ గరఁగి జారీ
వెలి నిన్నుఁ బాసినవిరహానను
మలసిన కోరికలు మతిలోఁ దీఁ గెలువారీ
వలపుల చెమటలవానలను
(॥॥)
వేవేగఁ బెట్టినకొప్పు వెడజారీ మూఁపుమీఁ ద
నీవొద్దికి వచ్చేటి నిబ్బరానను
పూవుల దండలో నిపుప్పొడి దుమ్ములురేఁ గీ
కావరపునిట్టూర్పుల గాలిచేతను
(॥॥)
మునుకొని మొరసీని ముంజేతికంకణములు
తనివార నిన్నుఁ గూడేతమకమున
యెనసితివి శ్రీవేంకటేశ యింతలోనె యీకెను
వినయాన నీకు మొక్కీ వేడుకలను
(||pallavi||)
sittagiṁchi sūḍavayya sĕli lāgu
bittarabu javvanamu pĕchchubĕrigīni
(||||)
sĕlivīnulajavvādi sĕkkulam̐ garam̐gi jārī
vĕli ninnum̐ bāsinavirahānanu
malasina korigalu madilom̐ dīm̐ gĕluvārī
valabula sĕmaḍalavānalanu
(||||)
vevegam̐ bĕṭṭinagŏppu vĕḍajārī mūm̐pumīm̐ da
nīvŏddigi vachcheḍi nibbarānanu
pūvula daṁḍalo nibuppŏḍi dummulurem̐ gī
kāvarabuniṭṭūrbula gālisedanu
(||||)
munugŏni mŏrasīni muṁjedigaṁkaṇamulu
tanivāra ninnum̐ gūḍedamagamuna
yĕnasidivi śhrīveṁkaḍeśha yiṁtalonĕ yīgĕnu
vinayāna nīgu mŏkkī veḍugalanu