చిత్తగించి చక్కఁజూడు చెలియ లాగు
(॥పల్లవి॥)
చిత్తగించి చక్కఁజూడు చెలియ లాగు
యిత్తల బహుపరాకు లెన్నైనాఁ గలవు
(॥చిత్త॥)
సిగ్గువడ నేర్చుఁగాని చెలి నీ వేమిసేసినా
యెగ్గుపట్ట నేరుదు యెంత మోహమో
వొగ్గి నీకిచ్చకములే వొనరించ నేర్చుఁగాని
వెగ్గళించ నేరదు వేడు కెట్టిదో
(॥చిత్త॥)
ముద్దు చూపవనేర్వుఁగాని మొక్కలానఁ దిట్టినాను
అద్ద లించ నేరుదు ఆస యెట్టిదో
వొద్దికలే నేర్చుఁగాని వొట్టు నీవు వెట్టితేను
వుద్దండాలు నేరుదు వోరు పిఁక నెట్టిదో
(॥చిత్త॥)
కలయఁగ నేర్చుఁగాని గక్కన శ్రీవేంకటేశ
అల ఇంచ నేరదు అలమేల్ మంగ
వలవఁగ నేర్చుఁగాని వసమై నీవు గూడితే
సొలయఁగ నేరుదు చుట్టరిక మెట్టిదో
(||pallavi||)
sittagiṁchi sakkam̐jūḍu sĕliya lāgu
yittala bahubarāgu lĕnnainām̐ galavu
(||sitta||)
sigguvaḍa nersum̐gāni sĕli nī vemisesinā
yĕggubaṭṭa nerudu yĕṁta mohamo
vŏggi nīgichchagamule vŏnariṁcha nersum̐gāni
vĕggaḽiṁcha neradu veḍu kĕṭṭido
(||sitta||)
muddu sūbavanervum̐gāni mŏkkalānam̐ diṭṭinānu
adda liṁcha nerudu āsa yĕṭṭido
vŏddigale nersum̐gāni vŏṭṭu nīvu vĕṭṭidenu
vuddaṁḍālu nerudu voru pim̐ka nĕṭṭido
(||sitta||)
kalayam̐ga nersum̐gāni gakkana śhrīveṁkaḍeśha
ala iṁcha neradu alamel maṁga
valavam̐ga nersum̐gāni vasamai nīvu gūḍide
sŏlayam̐ga nerudu suṭṭariga mĕṭṭido