Sittagimchi rakshimchu shreehari neevu

చిత్తగించి రక్షించు శ్రీహరి నీవు
Language

(॥పల్లవి॥)
చిత్తగించి రక్షించు శ్రీహరి నీవు
యిత్తల మా నేరములు యెన్ని లేవయ్యా

(॥చిత్త॥)
అంగము యేడుజానలు ఆస కొండలపొడవు
యెంగిలిమేను ఆచార మెంతైనాఁ గద్దు
జంగి లింతే సంసారము సాధించేది లోకమెల్లా
అంగడిఁ బడి జీవుని కలపు లేదయ్యా

(॥చిత్త॥)
మఱి నల్లెఁడు నాలికె మాటలు గంపెఁడేసి
యెఱుక గొంచె మజ్ఞాన మెంచఁగరాదు
గుఱిలేనిది బదుకు కొలఁది లేదు భోగము
వెఱవని జీవునికి వేసట లేదయ్యా

(॥చిత్త॥)
పట్టరానిది మనసు బయలు వందిలి చేఁత
చుట్టుకొన్నది కర్మము వట్టిది గుట్టు
యిట్టె యలమేలుమంగ నేలె శ్రీవేంకటేశుఁడు
నెట్టన నీబంటుజీవునికి మితిలేదయ్యా

(||pallavi||)
sittagiṁchi rakṣhiṁchu śhrīhari nīvu
yittala mā neramulu yĕnni levayyā

(||sitta||)
aṁgamu yeḍujānalu āsa kŏṁḍalabŏḍavu
yĕṁgilimenu āsāra mĕṁtainām̐ gaddu
jaṁgi liṁte saṁsāramu sādhiṁchedi logamĕllā
aṁgaḍim̐ baḍi jīvuni kalabu ledayyā

(||sitta||)
maṟi nallĕm̐ḍu nāligĕ māḍalu gaṁpĕm̐ḍesi
yĕṟuga gŏṁchĕ majñāna mĕṁcham̐garādu
guṟilenidi badugu kŏlam̐di ledu bhogamu
vĕṟavani jīvunigi vesaḍa ledayyā

(||sitta||)
paṭṭarānidi manasu bayalu vaṁdili sem̐ta
suṭṭugŏnnadi karmamu vaṭṭidi guṭṭu
yiṭṭĕ yalamelumaṁga nelĕ śhrīveṁkaḍeśhum̐ḍu
nĕṭṭana nībaṁṭujīvunigi midiledayyā