Sittagimchi neevu daya seyamgaraadaa

చిత్తగించి నీవు దయ సేయఁగరాదా
Language

(॥పల్లవి॥)
చిత్తగించి నీవు దయ సేయఁగరాదా
బత్తి సేసి నీకుఁ గడు బాఁతిపడి వున్నది

(॥॥)
చెక్కు చేతఁబెట్టుకొని సెలవుల నవ్వుతాను
నెక్కొని యున్నది చెలి నీయెదుటను
వెక్కసపుఁదమకాన విడెము చేతఁ బట్టుక
యెక్కువైన యాసలతో నిచ్చగించి యున్నది

(॥॥)
సారె జారుఁగొప్పుతోడ జవ్వనాన విఱ్ఱవీఁగి
నేరుపుతో మాటలాడీ నీ యెదుటను
బోరున నిన్నెచ్చరించి పువ్వుల వేసుకొంటా
కూరిములు గానరాఁగా గుట్టుతోడ నున్నది

(॥॥)
అలరి కాఁగిటఁగూడి అలపు సొలపుతోడ
నిలిచె నలమేల్మంగ నీయెదుటను
యెలమి శ్రీ వేంకటేశ ఇరవై పానుపుమీఁద
వెలసినసింగారాల వేడుకతతో నున్నది

(||pallavi||)
sittagiṁchi nīvu daya seyam̐garādā
batti sesi nīgum̐ gaḍu bām̐tibaḍi vunnadi

(||||)
sĕkku sedam̐bĕṭṭugŏni sĕlavula navvudānu
nĕkkŏni yunnadi sĕli nīyĕduḍanu
vĕkkasabum̐damagāna viḍĕmu sedam̐ baṭṭuga
yĕkkuvaina yāsalado nichchagiṁchi yunnadi

(||||)
sārĕ jārum̐gŏppudoḍa javvanāna viṭravīm̐gi
nerubudo māḍalāḍī nī yĕduḍanu
boruna ninnĕchchariṁchi puvvula vesugŏṁṭā
kūrimulu gānarām̐gā guṭṭudoḍa nunnadi

(||||)
alari kām̐giḍam̐gūḍi alabu sŏlabudoḍa
nilisĕ nalamelmaṁga nīyĕduḍanu
yĕlami śhrī veṁkaḍeśha iravai pānubumīm̐da
vĕlasinasiṁgārāla veḍugadado nunnadi