Sittagimchi neeve nannum jegoni paalimtugaaga

చిత్తగించి నీవే నన్నుఁ జేకొని పాలింతుగాక
Language

(॥పల్లవి॥)
చిత్తగించి నీవే నన్నుఁ జేకొని పాలింతుగాక
బత్తు లేడకెక్కును నా భావ మేమున్నదిరా

(॥చిత్త॥)
చేరి నీమోము చూచితే సిగ్గులే ముంచీ నాకు
యేరీతి మాటలాడుదు యేమిసేతురా
ఆరయ నిన్నునంటితే నంగమెల్లాఁ జెమరించీ
నేరుపు లేడకెక్కును నేఁడు నీముందరను

(॥చిత్త॥)
ననుపు నటించఁబోతే నవ్వులే వచ్చీ నాకు
మనసెటు దెలుసు నీమర్మమేదిరా
చనుమొనల నొత్తితే జాజుకొనఁ బులకించీ
తనివేడఁ దెచ్చుకొందు దంటవు నీయెదుట

(॥చిత్త॥)
గడుగఁ గాఁగిలించబోతే కరఁగీ మర్మములెల్ల
తడవ కెట్టుండుదును తతి యేదిరా
అడరి శ్రీవేంకటేశ అలమేలేమంగ నేను
జడియక కూడితివి సరసుఁడవౌదువు

(||pallavi||)
sittagiṁchi nīve nannum̐ jegŏni pāliṁtugāga
battu leḍagĕkkunu nā bhāva memunnadirā

(||sitta||)
seri nīmomu sūside siggule muṁchī nāgu
yerīdi māḍalāḍudu yemisedurā
āraya ninnunaṁṭide naṁgamĕllām̐ jĕmariṁchī
nerubu leḍagĕkkunu nem̐ḍu nīmuṁdaranu

(||sitta||)
nanubu naḍiṁcham̐bode navvule vachchī nāgu
manasĕḍu dĕlusu nīmarmamedirā
sanumŏnala nŏttide jājugŏnam̐ bulagiṁchī
taniveḍam̐ dĕchchugŏṁdu daṁṭavu nīyĕduḍa

(||sitta||)
gaḍugam̐ gām̐giliṁchabode karam̐gī marmamulĕlla
taḍava kĕṭṭuṁḍudunu tadi yedirā
aḍari śhrīveṁkaḍeśha alamelemaṁga nenu
jaḍiyaga kūḍidivi sarasum̐ḍavauduvu