Sittagimchi maabai dayaseduvugaaga

చిత్తగించి మాపై దయసేతువుగాక
Language

(॥పల్లవి॥)
చిత్తగించి మాపై దయసేతువుగాక
బత్తిగలవాఁడ వింత పచ్చిసేయనేలా

(॥చిత్త॥)
మక్కువ నీపాదాలు మరిగినదాన నేను
యెక్కువ తక్కువమాఁట లిఁకనేలా
చెక్కులు, నీవు నొక్కఁగా సేదదేరినట్టిదాన
పక్కన నంతేసి వేరే పరాకులేలా

(॥చిత్త॥)
చేరి నీకు నేపొద్దు చెప్పినట్టు సేసేదాన
కూరిమి నీలో వట్టిగుట్లేలా
మేరతో నీసన్నలతో మెలఁగేటియట్టిదాన
గారవించితివి నన్ను కడమ మరేలా

(॥చిత్త॥)
కందువనీ కాఁగిటికి గలిగిన యట్టిదాన
చందాలు సేనుక వట్టిజాగులేలా
యిందుకే శ్రీ వేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
చెందెను నీదయ నాపై చింత లిఁకనేలా

(||pallavi||)
sittagiṁchi mābai dayaseduvugāga
battigalavām̐ḍa viṁta pachchiseyanelā

(||sitta||)
makkuva nībādālu mariginadāna nenu
yĕkkuva takkuvamām̐ṭa lim̐kanelā
sĕkkulu, nīvu nŏkkam̐gā sedaderinaṭṭidāna
pakkana naṁtesi vere parāgulelā

(||sitta||)
seri nīgu nebŏddu sĕppinaṭṭu sesedāna
kūrimi nīlo vaṭṭiguṭlelā
merado nīsannalado mĕlam̐geḍiyaṭṭidāna
gāraviṁchidivi nannu kaḍama marelā

(||sitta||)
kaṁduvanī kām̐giḍigi galigina yaṭṭidāna
saṁdālu senuga vaṭṭijāgulelā
yiṁduge śhrī veṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
sĕṁdĕnu nīdaya nābai siṁta lim̐kanelā