చిత్తగించవోయి నీవు శిరసువంచుకొనక
(॥పల్లవి॥)
చిత్తగించవోయి నీవు శిరసువంచుకొనక
బిత్తరాన నీకె నీపై ప్రియము చల్లీని
(॥॥)
పలుచనిసిగ్గుతోడ బాసికము గట్టుకొని
చెలరేఁగి సతి నీపై సేసచల్లీని
చెలులమాటుననుండి చిప్పిలుఁదమకమున
తళుకుఁజూపుల నిన్ను తప్పక చూచీని
(॥॥)
చెంది మురిపెముతోడ సింగారించుకొని
కందువ లంటుచు నీకాలుదొక్కీని
సందడివేళలందు జాణతనాలాడి నీకు
ముందుముందుగాఁదాను మోవి చూపీని
(॥॥)
గాటఁపుటాసలతోడి కంకణము నీకుఁగట్టి
పీఁటమీఁదఁగూచుండి పెండ్లాడీని
యీటున శ్రీవేంకటేశ యిటు నన్ను గూడితివి
మేటియై యిందుకు నాపె మెచ్చు మెచ్చీని
(||pallavi||)
sittagiṁchavoyi nīvu śhirasuvaṁchugŏnaga
bittarāna nīgĕ nībai priyamu sallīni
(||||)
palusanisiggudoḍa bāsigamu gaṭṭugŏni
sĕlarem̐gi sadi nībai sesasallīni
sĕlulamāḍunanuṁḍi sippilum̐damagamuna
taḽugum̐jūbula ninnu tappaga sūsīni
(||||)
sĕṁdi muribĕmudoḍa siṁgāriṁchugŏni
kaṁduva laṁṭusu nīgāludŏkkīni
saṁdaḍiveḽalaṁdu jāṇadanālāḍi nīgu
muṁdumuṁdugām̐dānu movi sūbīni
(||||)
gāḍam̐puḍāsaladoḍi kaṁkaṇamu nīgum̐gaṭṭi
pīm̐ṭamīm̐dam̐gūsuṁḍi pĕṁḍlāḍīni
yīḍuna śhrīveṁkaḍeśha yiḍu nannu gūḍidivi
meḍiyai yiṁdugu nābĕ mĕchchu mĕchchīni