Sittagimchavayyaa yee sirulellaanu

చిత్తగించవయ్యా యీ సిరులెల్లాను
Language

(॥పల్లవి॥)
చిత్తగించవయ్యా యీ సిరులెల్లాను
హత్తి నీ భాగ్యములే అన్నిటా మెరసెను

(॥చిత్త॥)
చక్కందనమే కాదా సతికి సింగారము
చెక్కటి చెయ్యే కాదా చెలువమెల్లా
నిక్కుఁజన్నులే కావా నిండినగంభీరములు
వొక్కటొక్కటే పొగడ నువిదలవసమా

(॥చిత్త॥)
జవ్వనపాయమె కాదా జడిగొన్నమోహనము
నవ్వేటి నవ్వులే కావా నానా భోగాలు
పువ్వుల కొప్పే కాదా పొందులెల్లారేఁచేది
ఇవ్విదాన వర్ణించ నీ తరుణులవశమా

(॥చిత్త॥)
కన్నుల చూపులే కావా కాఁగిటఁ గూడించినవి
సన్నలమోవులే కావా చవులయ్యేవి
అన్నిటా శ్రీవేంకటేశ అలమేల్మంగైనదీకె
మన్ననమీరతు లెంచ మా బోంట్లు నేరుతురా

(||pallavi||)
sittagiṁchavayyā yī sirulĕllānu
hatti nī bhāgyamule anniḍā mĕrasĕnu

(||sitta||)
sakkaṁdaname kādā sadigi siṁgāramu
sĕkkaḍi sĕyye kādā sĕluvamĕllā
nikkum̐jannule kāvā niṁḍinagaṁbhīramulu
vŏkkaḍŏkkaḍe pŏgaḍa nuvidalavasamā

(||sitta||)
javvanabāyamĕ kādā jaḍigŏnnamohanamu
navveḍi navvule kāvā nānā bhogālu
puvvula kŏppe kādā pŏṁdulĕllārem̐sedi
ivvidāna varṇiṁcha nī taruṇulavaśhamā

(||sitta||)
kannula sūbule kāvā kām̐giḍam̐ gūḍiṁchinavi
sannalamovule kāvā savulayyevi
anniḍā śhrīveṁkaḍeśha alamelmaṁgainadīgĕ
mannanamīradu lĕṁcha mā boṁṭlu nerudurā