చిత్తగించవయ్యా చెలియ విలాసాలు
(॥పల్లవి॥)
చిత్తగించవయ్యా చెలియ విలాసాలు
బత్తిసేసీ నేఁడు నీపాదా లొత్తఁగాను
(॥చిత్త॥)
చిగురుమోవిమీఁదఁ జిప్పిలీఁ దేనెలు కడు
మగువ నీతో నట్టె మాటాడఁగాను
నగెడిసెలవులను నారుకొనీఁ గప్పురము
మొగము చూచి నీకు మొక్కఁగాను
(॥చిత్త॥)
నెరసి గుబ్బలమీఁద నిండీఁ బులక లివె
తరుణి పయ్యెద నిన్నుఁ దాఁకఁగాను
పురిగొని కొప్పులోని పువ్వులు రాలీ నివె
బెరసి నీకాఁగిటఁ బెనఁగఁగాను
(॥చిత్త॥)
కలికి మొగములోనఁ గళలు రేఁగీ నవె
అలమేలుమంగ నిన్ను నలమఁగాను
అలరి శ్రీవేంకటేశ అంగములు పొంగీ నవె
అలసినరతిలో నీవాదరించఁగాను
(||pallavi||)
sittagiṁchavayyā sĕliya vilāsālu
battisesī nem̐ḍu nībādā lŏttam̐gānu
(||sitta||)
sigurumovimīm̐dam̐ jippilīm̐ denĕlu kaḍu
maguva nīdo naṭṭĕ māḍāḍam̐gānu
nagĕḍisĕlavulanu nārugŏnīm̐ gappuramu
mŏgamu sūsi nīgu mŏkkam̐gānu
(||sitta||)
nĕrasi gubbalamīm̐da niṁḍīm̐ bulaga livĕ
taruṇi payyĕda ninnum̐ dām̐kam̐gānu
purigŏni kŏppuloni puvvulu rālī nivĕ
bĕrasi nīgām̐giḍam̐ bĕnam̐gam̐gānu
(||sitta||)
kaligi mŏgamulonam̐ gaḽalu rem̐gī navĕ
alamelumaṁga ninnu nalamam̐gānu
alari śhrīveṁkaḍeśha aṁgamulu pŏṁgī navĕ
alasinaradilo nīvādariṁcham̐gānu