Sittagimchavayyaa neesimgaarabu devulanu

చిత్తగించవయ్యా నీసింగారపు దేవులను
Language

(॥పల్లవి॥)
చిత్తగించవయ్యా నీసింగారపు దేవులను
హత్తి కరుణించరాదా ఆసపడీని

(॥॥)
నిండారాఁ దన మీఁద నీవు బత్తిగలవని-
యండనున్న చెలితోడ నానతిచ్చీని
పండఁబడి నీవుండిన పర పిది తనదని
వెండియును తన పెను వేలఁ జూపీని

(॥॥)
చనవున నిద్దరికి సమద్రిష్టాయనని
తనపొరుగాపె తోడఁ దలపోసీని
ననిచిన యట్టి ప్రాణనాథుడవు నీవని
వొనరఁ జేకావికలు వొడిఁబెట్టి పంపీని

(॥॥)
బెట్టినీనోరను తన పేరు నుడిగేవని
చుట్టపు వనితతోఁ బొంచు లాలించీని
యిట్టె శ్రీవేంకటేశ యేలితివి మగువను
గుట్టుతోడఁ దనకు నిన్నే గురిసేసీని

(||pallavi||)
sittagiṁchavayyā nīsiṁgārabu devulanu
hatti karuṇiṁcharādā āsabaḍīni

(||||)
niṁḍārām̐ dana mīm̐da nīvu battigalavani-
yaṁḍanunna sĕlidoḍa nānadichchīni
paṁḍam̐baḍi nīvuṁḍina para pidi tanadani
vĕṁḍiyunu tana pĕnu velam̐ jūbīni

(||||)
sanavuna niddarigi samadriṣhṭāyanani
tanabŏrugābĕ toḍam̐ dalabosīni
nanisina yaṭṭi prāṇanāthuḍavu nīvani
vŏnaram̐ jegāvigalu vŏḍim̐bĕṭṭi paṁpīni

(||||)
bĕṭṭinīnoranu tana peru nuḍigevani
suṭṭabu vanidadom̐ bŏṁchu lāliṁchīni
yiṭṭĕ śhrīveṁkaḍeśha yelidivi maguvanu
guṭṭudoḍam̐ danagu ninne gurisesīni