చిత్తగించవయ్య యేల సిగ్గులతో నవ్వేవు
(॥పల్లవి॥)
చిత్తగించవయ్య యేల సిగ్గులతో నవ్వేవు
బత్తిగలవారిమీఁద పరాకు గావచ్చునా
(॥చిత్త॥)
కిన్నెరమీటులలోనే కెరలికెరలి నీకు
విన్నపాలు సేసీవి వెలఁది
సన్నలాను చాయలాను జారినపయ్యదలోని-
చన్నులనే కానికలు సారెకుఁ జూపీని
(॥చిత్త॥)
సేసేటిరాగాలలోనే చెలరేఁగి చెలరేఁగి
సేసలుచల్లీ వలపుచెలియ
మూసినముత్తెమువంటిమోవినే నోరూరించి
ఆసల విందులు చెప్పీ నదివో నీకును
(॥చిత్త॥)
చెప్పిన గీతములలోసిగ్గు గులికికులికి
కప్పురవిడెములిచ్చీఁ గలికి
యిప్పుడే శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
కప్పి నన్నేలితి వాపెఁ గరుణించవయ్యా
(||pallavi||)
sittagiṁchavayya yela siggulado navvevu
battigalavārimīm̐da parāgu gāvachchunā
(||sitta||)
kinnĕramīḍulalone kĕraligĕrali nīgu
vinnabālu sesīvi vĕlam̐di
sannalānu sāyalānu jārinabayyadaloni-
sannulane kānigalu sārĕgum̐ jūbīni
(||sitta||)
seseḍirāgālalone sĕlarem̐gi sĕlarem̐gi
sesalusallī valabusĕliya
mūsinamuttĕmuvaṁṭimovine norūriṁchi
āsala viṁdulu sĕppī nadivo nīgunu
(||sitta||)
sĕppina gīdamulalosiggu guligiguligi
kappuraviḍĕmulichchīm̐ galigi
yippuḍe śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
kappi nannelidi vābĕm̐ garuṇiṁchavayyā