చిత్తగించవయ్య యీపె చేఁతలెల్లాను
(॥పల్లవి॥)
చిత్తగించవయ్య యీపె చేఁతలెల్లాను
గుత్తపు రతులు చూడ కొత్తలాయ నిపుడు
(॥॥)
సెలవుల నగవులు చిప్పిలులేఁతసిగ్గులు
మొలకవలపు నీపై ముంచీఁ జెలి
పిలుపులకొసరులు పెనగేటి సరసాలు
పలుమారు నీమీఁదఁ బచరించీని
(॥॥)
బొమ్మముడిజంకెనలు పొద్దువోనిఅలపులు
చిమ్ములకనుచూపులు చిలికీఁ జెలియ
వుమ్మగిలుకోరికలు వుసురసురుఁగాఁకలు
కుమ్మరించి నీయెదుట కుప్పలువోసీని
(॥॥)
సన్నలలో మాటలు జవళిఅడియాసలు
వన్నెలుగా నీమీఁద వంచీ జెలి
యెన్నఁగ శ్రీ వేంకటేశ యెనసితి వింతలోనె
కన్నె వేడుకలు నీకుఁ గానుక వట్టీని
(||pallavi||)
sittagiṁchavayya yībĕ sem̐talĕllānu
guttabu radulu sūḍa kŏttalāya nibuḍu
(||||)
sĕlavula nagavulu sippilulem̐tasiggulu
mŏlagavalabu nībai muṁchīm̐ jĕli
pilubulagŏsarulu pĕnageḍi sarasālu
palumāru nīmīm̐dam̐ basariṁchīni
(||||)
bŏmmamuḍijaṁkĕnalu pŏdduvonialabulu
simmulaganusūbulu siligīm̐ jĕliya
vummagilugorigalu vusurasurum̐gām̐kalu
kummariṁchi nīyĕduḍa kuppaluvosīni
(||||)
sannalalo māḍalu javaḽiaḍiyāsalu
vannĕlugā nīmīm̐da vaṁchī jĕli
yĕnnam̐ga śhrī veṁkaḍeśha yĕnasidi viṁtalonĕ
kannĕ veḍugalu nīgum̐ gānuga vaṭṭīni