Sittagimchavayya yee kotta lennam deṟumgamu

చిత్తగించవయ్య యీ కొత్త లెన్నఁ డెఱుఁగము
Language

(॥పల్లవి॥)
చిత్తగించవయ్య యీ కొత్త లెన్నఁ డెఱుఁగము
హత్తి యాపె వలపు లేమని చెప్పే మిఁకను

(॥॥)
నిన్నుఁబాసి విరహాన నెలఁత తన మొగమే
వెన్నెల రాజని యెంచి విన్ననయ్యీని
కన్నుఁగవ చూపులు కలువ బాణములని
పన్నుక లోలోనె రెప్పలు వంచీని

(॥॥)
పక్కన నినుఁ దలఁచి భ్రమసి తన చన్నులే
జక్కవ పిట్టలనుచు సారెఁ గప్పీని
నిక్కిన తన తురుము నిండుఁ దేఁటిపౌఁజని
చక్కఁబెట్టుకో ముడిచి జారివుండినాను

(॥॥)
తగ నిన్నుఁబేరుకొని తడఁబడీ పెదవులు
చిగురు టడిదాల నీ చేత మూసీని
నిగిడి శ్రీ వేంకటేశ నీ వింతలోఁ గూడితివి
తగఁదా నెప్పటివలె దైవారీ వేడుకలా

(||pallavi||)
sittagiṁchavayya yī kŏtta lĕnnam̐ ḍĕṟum̐gamu
hatti yābĕ valabu lemani sĕppe mim̐kanu

(||||)
ninnum̐bāsi virahāna nĕlam̐ta tana mŏgame
vĕnnĕla rājani yĕṁchi vinnanayyīni
kannum̐gava sūbulu kaluva bāṇamulani
pannuga lolonĕ rĕppalu vaṁchīni

(||||)
pakkana ninum̐ dalam̐si bhramasi tana sannule
jakkava piṭṭalanusu sārĕm̐ gappīni
nikkina tana turumu niṁḍum̐ dem̐ṭibaum̐jani
sakkam̐bĕṭṭugo muḍisi jārivuṁḍinānu

(||||)
taga ninnum̐berugŏni taḍam̐baḍī pĕdavulu
siguru ṭaḍidāla nī seda mūsīni
nigiḍi śhrī veṁkaḍeśha nī viṁtalom̐ gūḍidivi
tagam̐dā nĕppaḍivalĕ daivārī veḍugalā