Sittagimchavayya nannu seluvumdavu

చిత్తగించవయ్య నన్ను చెలువుఁడవు
Language

(॥పల్లవి॥)
చిత్తగించవయ్య నన్ను చెలువుఁడవు
బత్తిసేయఁగా వలపు పైకొనీని

(॥॥)
అడరి యెడమాటాడ నటు చెలి నంపేనంటే
తడవనీయదు సిగ్గు తతిగొనీని
వొడఁబరచ నీయింటి కొగి నే వచ్చేనంటే
తడఁబడీ నడుగులు తమకానను

(॥॥)
గక్కన నిన్ను నేఁ గాఁ గిలించుకొనేనంటే
అక్కజపు హరములు అడ్డమయ్యీని
చిక్కించుక నీకు నేఁడు చేతులెత్తి మొక్కేనంటే
పక్కనఁ జన్నులమీఁద పయ్యద జారీని

(॥॥)
దిట్టనై నీమోవితెనేతీపు చవిగొనేనంటే
అట్టె కడుఁ బరవశమందీ మనసు
యిట్టె శ్రీవేంకటేశ యేలితివి నన్ను, నిట్టె
చుట్టరిక మెంచెనంటే సొంపులెత్తీఁ గళలు

(||pallavi||)
sittagiṁchavayya nannu sĕluvum̐ḍavu
battiseyam̐gā valabu paigŏnīni

(||||)
aḍari yĕḍamāḍāḍa naḍu sĕli naṁpenaṁṭe
taḍavanīyadu siggu tadigŏnīni
vŏḍam̐barasa nīyiṁṭi kŏgi ne vachchenaṁṭe
taḍam̐baḍī naḍugulu tamagānanu

(||||)
gakkana ninnu nem̐ gām̐ giliṁchugŏnenaṁṭe
akkajabu haramulu aḍḍamayyīni
sikkiṁchuga nīgu nem̐ḍu sedulĕtti mŏkkenaṁṭe
pakkanam̐ jannulamīm̐da payyada jārīni

(||||)
diṭṭanai nīmovidĕnedību savigŏnenaṁṭe
aṭṭĕ kaḍum̐ baravaśhamaṁdī manasu
yiṭṭĕ śhrīveṁkaḍeśha yelidivi nannu, niṭṭĕ
suṭṭariga mĕṁchĕnaṁṭe sŏṁpulĕttīm̐ gaḽalu