Sittagimcham gadare vo selulaala

చిత్తగించఁ గదరె వో చెలులాల
Language

(॥పల్లవి॥)
చిత్తగించఁ గదరె వో చెలులాల
కొత్త కొత్త వినోదాలు గూడినట్టు మెరసె

(॥చిత్త॥)
మోమున కెగరేటి మొనవాఁడిగుబ్బలు
కామినికి నమ రెను కంటి రటవె
ఆమని చనుజక్కవ లట్టె వదనచంద్రుని
వేమరుఁ బొంచినయట్టి వేడుకలై మెరసె

(॥చిత్త॥)
సారెఁ జెంపలమీఁద జారి వుండిన తురుము
యీ రమణికి నమరె నిటు చూడరే
ఆ రీతిఁ దుమ్మిదగమి అధరామృతమునకు
బోరునఁ బొంచుకుండిన పోలికై మెరసెను

(॥చిత్త॥)
తనుపై మెరుఁగులు తరుణికి నమరికై
గొనకొనె నిదే కనుఁగొంటి రఁటవే
యెనసె శ్రీవేంకటేశుఁ డీకె యలమేల్మంగ
కనకము వన్నెలూ నొక్కటైనట్టు మెరసె

(||pallavi||)
sittagiṁcham̐ gadarĕ vo sĕlulāla
kŏtta kŏtta vinodālu gūḍinaṭṭu mĕrasĕ

(||sitta||)
momuna kĕgareḍi mŏnavām̐ḍigubbalu
kāminigi nama rĕnu kaṁṭi raḍavĕ
āmani sanujakkava laṭṭĕ vadanasaṁdruni
vemarum̐ bŏṁchinayaṭṭi veḍugalai mĕrasĕ

(||sitta||)
sārĕm̐ jĕṁpalamīm̐da jāri vuṁḍina turumu
yī ramaṇigi namarĕ niḍu sūḍare
ā rīdim̐ dummidagami adharāmṛtamunagu
borunam̐ bŏṁchuguṁḍina poligai mĕrasĕnu

(||sitta||)
tanubai mĕrum̐gulu taruṇigi namarigai
gŏnagŏnĕ nide kanum̐gŏṁṭi ram̐ṭave
yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ ḍīgĕ yalamelmaṁga
kanagamu vannĕlū nŏkkaḍainaṭṭu mĕrasĕ